logo

మేడే వద్దన్న మోదీని వదిలించుకుందాం: తమ్మినేని

ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే విదేశీయులదని, దీన్ని రద్దు చేస్తామని పిలుపునిచ్చిన ప్రధాని మోదీని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓడించి వదిలించుకుందామని, కార్మికుల ఐక్యతను చాటుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

Published : 02 May 2024 06:24 IST

ఖమ్మం గ్రెయిన్‌ మార్కెట్‌లో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే విదేశీయులదని, దీన్ని రద్దు చేస్తామని పిలుపునిచ్చిన ప్రధాని మోదీని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓడించి వదిలించుకుందామని, కార్మికుల ఐక్యతను చాటుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నగరంలోని గ్రెయిన్‌ మార్కెట్‌ వద్దనున్న సీఐటీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన మేడే వేడుకల్లో తమ్మినేని అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నేడు కార్మికవర్గం అనుభవిస్తున్న ఏ హక్కు ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలపై వచ్చింది కాదని, పోరాడి సాధించుకున్నవేనని గుర్తుచేశారు. కేంద్రంలోని మోదీ సర్కారు కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్తగా నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు. పని గంటలు 12గంటలకు పెంచేలా, సెలవు దినాలు తీసేసేలా, కార్మికుల సంక్షేమ చట్టాలను మార్పు చేసి కార్పొరేట్‌ కంపెనీల లాభాలను చేకూర్చేలా మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడం ద్వారా మేడే స్ఫూర్తిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు యర్రా శ్రీకాంత్‌, జిల్లా అధ్యక్షుడు, కల్యాణం వెంకటేశ్వరరావు, కార్యదర్శి టి.విష్ణు, వై.విక్రమ్‌, భూక్యా శ్రీనివాసరావు, బండారు యాకయ్య, శ్రీనివాసరావు, లింగయ్య, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని