logo

పోలింగ్‌ సమయంలో అప్రమత్తత అవసరం: కలెక్టర్‌

పోలింగ్‌ సమయంలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు.

Published : 02 May 2024 06:35 IST

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: పోలింగ్‌ సమయంలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పాలేరు, మధిర, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పోలింగ్‌ సిబ్బందికి బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలన్నారు. డీఆర్‌ఓ రాజేశ్వరి, కల్లూరు ఆర్డీఓ రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

 ఖమ్మం నగరం: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి వైరా నియోజకవర్గానికి అదనపు ఈవీఎంల     ఎఫ్‌ఎల్‌సీని ప్రారంభించినట్లు కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. కలెక్టరేట్‌ ఆవరణలోని ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరచి, ఎఫ్‌ఎల్‌సీ ప్రక్రియ     చేపట్టారు. అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్‌, మధుసూదన్‌నాయక్‌ పాల్గొన్నారు.

 ఖమ్మం నగరం: లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, హోం ఓటింగ్‌, ఓటరు స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. అదనపు   కలెక్టర్‌ సత్యప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, జడ్పీ సీఈఓ వినోద్‌, డీఆర్డీఓ సన్యాసయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని