logo
Published : 01/12/2021 03:03 IST

‘మా వాళ్లను రప్పించరూ..’


కార్మిక శాఖ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబాలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల పరిశ్రమలో ఉపాధి కోసం వెళ్లి అక్కడ నరకయాతన అనుభవిస్తున్న తమ పిల్లలను వెనక్కి రప్పించాలని బాధిత కుటుంబికులు అధికారులకు మొర పెట్టుకున్నారు. కాశీపూర్‌ సమితి మైకంచ్‌ కాలనీకి చెందిన బాధిత కుటుంబాల వారు మంగళవారం కార్మిక శాఖ కార్యాలయానికి చేరుకొని తమ గోడు వినిపించారు. వారు మాట్లాడుతూ మచిలీపట్నం సమీపంలోని ఓ రొయ్యల పరిశ్రమలో పనిచేసేందుకు వెళ్లిన తమ కుమారులకు అక్కడ యాజమాన్యం నరకం చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం వెళ్లిన నలుగురు యువకుల నుంచి చరవాణులను లాక్కొన్న యాజమాన్యం వారికి సరైన తిండి పెట్టకుండా రోజుకు 12 నుంచి 14 గంటల పాటు పని చేయిస్తున్నట్లు వాపోయారు. వేరే వ్యక్తికి చెందిన మొబైల్‌ ఫోన్‌ నుంచి తమకు ఈ సమాచారం అందించారని తెలిపారు. ఈ విషయమై ఈ నెల 26న కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. జిల్లా కార్మిక శాఖ అధికారిణి జాస్మిన్‌ సాహు మాట్లాడుతూ ఈ విషయమై విచారణ చేస్తున్నామని, త్వరలోనే యువకులను రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులను కలిసిన వారిలో రాజేశ్వర్‌ నాయక్‌, రత్ననాయక్‌, జయదేవ్‌ నాయక్‌ తదితరులు ఉన్నారు.

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని