logo
Published : 04/12/2021 04:45 IST

రేషన్‌ బండి తొండి

వడ్డెగేరిలో చౌకదుకాణం వద్దనే రోజంతా ఆగిపోయిన ఎండీయూ వాహనం.,

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: నగరంలో చౌకధర దుకాణం-137 పరిధిలో ఎండీయూ వాహనం ఇంటింటికి వెళ్లడం లేదు. వాహనదారుడు, డీలరు ఒక్కటయ్యారు. దుకాణం వద్దే నిలిపి లబ్ధిదారులకు రేషన్‌ అందజేస్తున్నారు. నగరంలోని వడ్డెరగేరిలో రేషన్‌ షాపు-39 పరిధిలో వాహనం పరిస్థితి ఇలానే ఉంది. చిత్తారి వీధి, మేడం సత్రం, వడ్డెగేరి, కొత్తపేట, శరీన్‌నగర్‌, తదితర ప్రాంతాల్లో రేషన్‌ బండ్లు ఆగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. చౌకదుకాణాల డీలర్లు, ఎండీయూ వాహనదారులు కలిసిపోయారువాహనానికి ప్రభుత్వం ఇచ్చే బిల్లును ఇద్దరూ పంచుకొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పర్యవేక్షణ గాలికొదిలేశారు

కర్నూలు నగరంలో 1.09 లక్షల మంది కార్డుదారులుంటే 67 ఎండీయూ వాహనాలు కేటాయించారు. రెండు నుంచి మూడు దుకాణాలకు కలిసి ఒక వాహనం కేటాయించారు.

 ఇంటింటికీ రేషన్‌ పంపిణీకి శ్రీకారం చుట్టిన ప్రారంభంలో అధికారులు కార్డుదారులను అప్రమత్తం చేసేవారు. వీధికి రేషన్‌ బండి వస్తుందంటూ కార్డుదారుడి చరవాణికి సంక్షిప్త సమాచారం వచ్చేది. వాలంటీర్‌ వీధికి వచ్చి చెప్పేవారు. సచివాలయ వీఆర్వోలు పర్యవేక్షించే వారు. ప్రస్తుతం రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులెవ్వరూ పర్యవేక్షిస్తున్న దాఖలాలు లేవు. ఎండీయు వాహనదారుడే వీధికి వాహనాన్ని తీసుకొస్తున్నారు. గంటన్నర పాటు రేషన్‌ పంపిణీ చేసి వెళ్లిపోతున్నారు.

కార్డుదారులు : 11,83,682

దుకాణాలు : 2,436

వాహనాలు: 760

రేషన్‌ కోటా (ఈనెల)

బియ్యం : 18 వేల మెట్రిక్‌ టన్నులు

కంది పప్పు : వెయ్యి టన్నులు

చక్కెర : 576 టన్నులు

Read latest Kurnool News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని