logo

సంగీత జీవితం.. విషాద గీతం: ముద్ర సంస్థ మోసమే ప్రాణం తీసింది

ఓ ఫైనాన్స్‌ సంస్థ చేసిన నిర్వాకం యువతిని బలిగొంది. తల్లిదండ్రులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణంలోని ముద్ర ఫైనాన్స్‌ సంస్థలో పనిచేసే సంగీత(23) అనే యువతి ఆదివారం మృతిచెందారు. సంస్థ మోసం చేయడం వల్లే తమ కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

Updated : 22 Aug 2022 08:05 IST

తల్లిదండ్రుల ఆరోపణ

సంగీత(పాత చిత్రం)

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఓ ఫైనాన్స్‌ సంస్థ చేసిన నిర్వాకం యువతిని బలిగొంది. తల్లిదండ్రులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణంలోని ముద్ర ఫైనాన్స్‌ సంస్థలో పనిచేసే సంగీత(23) అనే యువతి ఆదివారం మృతిచెందారు. సంస్థ మోసం చేయడం వల్లే తమ కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఆదోని పట్టణం క్రాంతినగర్‌లో నివాసం ఉంటున్న హనుమేశ్‌, నాగవేణి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె సంగీత అనే యువతి ఏడు నెలల కిందట ఆదోని పట్టణంలోని ముద్ర ఫైనాన్స్‌ సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం పర్మనెంట్‌ కావాలంటే రూ.2లక్షలు డిపాజిట్‌ చేయాలని సంస్థ నిర్వాహకులు పేర్కొనడంతో అప్పు చేసి సంస్థకు చెల్లించారు. అలాగే మరికొంత నగదును డిపాజిట్‌ చేయాలని సంస్థ నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారు. తెలిసినవారు, స్నేహితులతో సుమారు రూ.7 లక్షలు వరకు డిపాజిట్‌ చేయించామన్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకే సంస్థ బోర్డు తిప్పేసింది. తాము సంస్థలో డిపాజిట్‌ చేసిన డబ్బులు రాకపోగా.. తెలిసిన వారితో డిపాజిట్‌ చేయించిన డబ్బులు చెల్లించాలని.. తమ కుమార్తెపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక మానసికంగా క్షోభతో తీవ్ర అనారోగ్యానికి గురైందన్నారు. చికిత్స కోసం కర్నూలు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించామన్నారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిందన్నారు. కలెక్టరు, ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని