logo

ఆధ్యాత్మికతతోనే మానవాళి మనుగడ

ఆధ్యాత్మిక చింతనతోనే మానవాళి మనుగడ సాధ్యమని త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు.

Published : 27 Jan 2023 05:35 IST

భూమి పూజ చేస్తున్న చినజీయర్‌స్వామి

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : ఆధ్యాత్మిక చింతనతోనే మానవాళి మనుగడ సాధ్యమని త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. మండలంలోని తిప్పాయిపల్లెలో దాత రామమోహన్‌రెడ్డి దంపతులు ఆధ్వర్యంలో తలపెట్టిన భూనీలా సమేత వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి చినజీయర్‌స్వామితోపాటు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి గురువారం హాజరై భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో కులమతాలకు అతీతంగా అందరూ కలసికట్టుగా బతకాలని సూచించారు. మనిషి సవ్యంగా బతకాలంటే చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మానవుడు ప్రకృతితోపాటు ప్రాణకోటితో కలిసి బతకాలన్నారు. ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ ఆలయ నిర్మాణంలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ధనవంతులకు సంబంధించిన గదులకు మాత్రమే తితిదే అద్దెలు పెంచిందని చెప్పారు.   కర్నూలు గ్రామీణ సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై మల్లికార్జున ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.   కేడీసీసీ మాజీ ఛైర్మన్‌ మల్లికార్జున, ఓర్వకల్లు, తిప్పాయిపల్లె సర్పంచులు అనూష, కృష్ణవేణమ్మ, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు