logo

అఘాయిత్యాలు అరికట్టడంలో విఫలం

దేశంలో మహిళలపై అత్యాచారాలను అరికట్టడడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జయలక్షి ఆరోపించారు.

Published : 27 Mar 2023 03:07 IST

ప్రసంగిస్తున్న ఏపీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జయలక్ష్మి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: దేశంలో మహిళలపై అత్యాచారాలను అరికట్టడడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జయలక్షి ఆరోపించారు. ఎమ్మిగనూరు పట్టణంలో ఆదివారం జరిగిన మహిళా సమాఖ్య సమావేశంలో జయలక్ష్మి మాట్లాడుతూ దేశంలో ఆరేళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలపై అత్యాచారాలు, దాడులకు పాల్పడుతున్నారన్నారు. దిశ చట్టం అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన సంఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయన్నారు. అనంతరం ఎమ్మిగనూరు మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా వెంకటలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఈరమ్మ, 27 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, ఈశ్వరమ్మ, నాగవేణి, వెంకటలక్ష్మి, సరోజ, ఉరుకుందమ్మ, ఈరమ్మ, లక్ష్మి, కృష్ణమ్మ, నాగవేణి, రంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని