logo

జగన్‌ను ఇంటికి సాగనంపుదాం

ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దఎత్తున హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు కోరారు.

Published : 28 Mar 2024 03:18 IST

మాట్లాడుతున్న బీటీ నాయుడు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దఎత్తున హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు కోరారు. ఆయన బుధవారం మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో 85 శాతం ఎగ్గొట్టారని ఆరోపించారు. నాసిరకం మద్యంతో 30 వేల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని, విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన హామీని విస్మరించి 9 పర్యాయాలు ఛార్జీలు పెంచి రూ.64 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. జిల్లాకు వస్తున్న జగన్‌ను నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెదేపాను గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని