logo

అధికార పన్నాగం

నందికొట్కూరులో అధికార పార్టీ నేతలు భూ దందాకు తెరలేపారు.. ముందస్తుగా కొనుగోలు చేసి పెట్టుకున్న తమ భూములకు విలువ పెంచుకోవడం.. అక్కడ స్థిరాస్తి వ్యాపారం చేసుకోవాలన్న దురుద్దేశంతో హడావుడిగా పుర కార్యాలయం నిర్మాణానికి పునాది వేశారు.

Published : 16 Apr 2024 06:26 IST

నిర్మాణం కోసం తీసిన గుంతలు

నిఘా విభాగం, న్యూస్‌టుడే : నందికొట్కూరులో అధికార పార్టీ నేతలు భూ దందాకు తెరలేపారు.. ముందస్తుగా కొనుగోలు చేసి పెట్టుకున్న తమ భూములకు విలువ పెంచుకోవడం.. అక్కడ స్థిరాస్తి వ్యాపారం చేసుకోవాలన్న దురుద్దేశంతో హడావుడిగా పుర కార్యాలయం నిర్మాణానికి పునాది వేశారు. పట్టణంలోని సర్వే నంబరు 137(బి)లో ఒక ఎకరం భూమిని ఇద్దరు వ్యక్తులు పుర పాలక కార్యాలయానికి గతంలో రాసిచ్చారు. ఆ స్థలం పక్కన 137-బిలో 1.50 ఎకరాలు, 137-ఏలో 5.65, 137-బి-1ఏలో 2.32, 137-బి-1బి-1లో 2.32, 137-బి-1బి1-ఏలో 2.32, 137-బి-1బి1-బిలో 1.17 కలిపి 13.93 ఎకరాలు ఉంది. పక్కనున్న మరో 30 ఎకరాల్లో కలిపి జగనన్న స్మార్టు టౌన్‌ షిప్‌ ఏర్పాటుకు అధికారులు రెండేళ్ల కిందట ప్రతిపాదనలు పంపించారు. ఇందుకు ఎకరాకు రూ.1.20 కోట్లు చెల్లించేలా ప్రతిపాదించారు. రూ.లక్షలు కూడా పలకని భూములను ఏకంగా రూ.కోట్లకు విక్రయించేందుకు పావులు కదిపారు. ఆరోపణలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది.

అక్కడే.. ఇప్పుడే ఎందుకో

13.93 ఎకరాల విలువ పెంచుకోవడానికి ఇద్దరు వ్యక్తులు ఉచితంగా ఇచ్చిన స్థలంలో నిర్మాణానికి పునాదులు వేస్తున్నారు. కార్యాలయ నిర్మాణానికి పట్టణానికి చెందిన ఇద్దరు దాతలు రెండెకరాల భూమి ఉచితంగా ఇస్తామని ముందుకొచ్చారు. వారి నుంచి తీసుకోకుండా కాలయాపన చేసిన వైకాపా నాయకులు స్థానికేతరులైన ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి ఎకరం స్థలమే తీసుకుని నిర్మాణం చేపట్టడంపై విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం పుర కార్యాలయం నిర్మాణం చేపడుతున్న స్థలంలో ఓ స్థిరాస్తి వ్యాపారి వెంచర్‌ వేశారు. గత నాలుగేళ్లుగా ఆ స్థలాలను ఎవరూ తీసుకోవడం లేదు. ఆ స్థిరాస్తి వ్యాపారి నుంచి వైకాపాకు చెందిన కొందరు నేతలు బేరాలు కుదుర్చుకుని అడ్వాన్సు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని