logo

పల్లెల అభివృద్ధి భాజపాతోనే సాధ్యం

ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన 80 మంది భాజపా అభ్యర్థి పార్థసారథి సమక్షంలో పార్టీలో చేరారు.

Published : 23 Apr 2024 03:20 IST

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన 80 మంది భాజపా అభ్యర్థి పార్థసారథి సమక్షంలో పార్టీలో చేరారు.

ఆదోని గ్రామీణం: మండలంలోని చిన్నపెండేకల్‌, నెట్టెకల్‌ గ్రామాల్లో సోమవారం రాత్రి భాజపా అభ్యర్థి పార్థసారథి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ, జనసేన బాధ్యుడు మల్లప్ప, దేవేంద్రప్ప, భూపాల్‌ చౌదరి పాల్గొన్నారు.


తెదేపాలో చేరిన వైకాపా నాయకులు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: తుగ్గలి మండలం రాంపల్లి, ఉప్పర్లపల్లి, హుసేనాపురం గ్రామాలకు చెందిన పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు సోమవారం తెదేపాలో చేరారు. పత్తికొండ తేదేపా కార్యాలయంలో నియోజకవర్గ అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో వారు పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు తిరుపాల్‌నాయుడు, బత్తిన వెంకటరాముడు, తుగ్గలి నాగేంద్ర, మనోహర్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.  


కురుబలంతా తెదేపాతోనే

హొళగుంద, న్యూస్‌టుడే: కురబలంతా తెదేపాతోనే నడుస్తామని ముద్దటమాగి కురుబ నాయకులు  సోమవారం అన్నారు. మండల కన్వీనర్‌ తిప్పయ్య ఆధ్వర్యంలో ముద్దటమాగి నాయకులు బీరప్ప, చాగప్ప హొళగుందలో మాట్లాడారు. తాము పార్టీ మారినట్లు వస్తున్న పుకార్లలో నిజం లేదన్నారు. కర్నూలు తెదేపా ఎంపీ అభ్యర్థి నాగరాజును, ఆలూరు అభ్యర్థి వీరభద్ర గౌడ్‌ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆదం బాషా, గాదిలింగ, మల్లప్ప, మల్లప్ప, చిన్న గాదిలింగ. వెంకట రెడ్టి పాల్గొన్నారు.


బాబుతోనే భవిష్యత్తుకు గ్యారంటీ

వెల్దుర్తి, న్యూస్‌టుడే: మండలంలోని ఎల్‌.బండ, పేరేముల, గోవర్దనగిరి గ్రామాల్లో తెదేపా నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో సుబ్బరాయుడు, కార్యక్రమంలో తెదేపా నాయకులు బలరాంగౌడ్‌, జ్ఞానేశ్వర్‌గౌడ్‌, రమాకాంత్‌రెడ్డి, జయరాముడు, విజయమోహన్‌రెడ్డి, యాగంటి, మధుసూదన్‌రెడ్డి, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని