logo

విధుల నుంచి 45 మంది తొలగింపు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 63 మందిపై చర్యలు తీసుకోగా..

Published : 04 May 2024 04:14 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 63 మందిపై చర్యలు తీసుకోగా.. అందులో 45 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి.సృజన శుక్రవారం తెలిపారు. వివిధ కేటగిరీల కింద ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 18 వరకు నమోదు చేశామని, అందులో ఆరు కేసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు చెప్పారు. సి.విజిల్‌ యాప్‌ ద్వారా ఇప్పటివరకు 246 ఫిర్యాదులు రాగా అందులో సహేతుకమైన 170 ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

  • ఓటరు హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబరు 1950కు ఇప్పటివరకు 3,216 ఫిర్యాదులు వచ్చాయని.. అందులో శుక్రవారం ఒక్కరోజే 200 కాల్స్‌ రాగా అన్నింటిని పరిష్కరించామని కలెక్టర్‌ డా.సృజన చెప్పారు. జిల్లా టోల్‌ఫ్రీ నంబరు 1800 425 7755, 08518- 220125కు మొత్తం 29 ఫిర్యాదులు రాగా అందులో శుక్రవారం ఒక ఫిర్యాదు వచ్చిందన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని