logo

ఓటర్ చైతన్య ర్యాలీ

ఆదోని పట్టణంలో మంగళవారం ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు.

Updated : 30 Apr 2024 15:57 IST

ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలో మంగళవారం ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఆర్ట్స్ అండ్

సైన్స్ కళాశాల నుంచి రిలయన్స్ ట్రెండ్స్, ఎన్జీవోస్ కాలనీ, నోబుల్ కాలేజ్, గణేష్ సర్కిల్ మీదుగా, బుడేకల్, హవన్నపేట్, ఏమేం రోడ్, భీమా సర్కిల్, మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగింది. మున్సిపల్, సెక్టారుల అధికారులు, బీఎల్వోలు, పోలీసులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదోని నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటర్ నమోదు శాతాన్ని పెంచుకోవాలసిన అవసరం ఉందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైని డీఎస్పీ ధీరజ్, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని