logo

1,139 దస్తావేజులు....రూ.2.95 కోట్ల ఆదాయం

రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండుతోంది. భూముల మార్కెట్‌ విలువలను వచ్చే నెల 1వ తేదీ నుంచి పెంచనుండటంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు క్రయ విక్రయదారులు పరుగులు తీస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వినియోగదారులతో కిక్కిరిసి పోతున్నాయి.

Published : 29 Jan 2022 04:34 IST

కిక్కిరిసిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు
మహబూబ్‌నగర్‌ కార్యాలయంలో రద్దీ
న్యూస్‌టుడే, పాలమూరు

స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండుతోంది. భూముల మార్కెట్‌ విలువలను వచ్చే నెల 1వ తేదీ నుంచి పెంచనుండటంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు క్రయ విక్రయదారులు పరుగులు తీస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వినియోగదారులతో కిక్కిరిసి పోతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో 1,139 దస్తావేజులకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వాటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,95,61,693 ఆదాయం వచ్చింది. అత్యధికంగా వనపర్తిలో 210 దస్తావేజులు నమోదు కాగా, అత్యల్పంగా అలంపూర్‌లో 24 దస్తావేజులే నమోదు అయ్యాయి. వనపర్తి, జడ్చర్ల, కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌, గద్వాల, నాగర్‌కర్నూల్‌ తదితర కార్యాలయాల్లో రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని