logo

ఏక కాలంలో రుణమాఫీకి ఎదురుచూపులు

రాష్ట్ర ప్రభుత్వం మరోనాలుగు రోజుల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. నాలుగు విడతలుగా రైతులకు రుణమాఫీ రూ.లక్ష వరకు చేస్తామని చెప్పినా.. అమల్లో మాత్రం ఆశించిన ప్రగతి కనిపించలేదు.

Published : 03 Feb 2023 03:16 IST

బడ్జెట్‌పై రైతుల ఆశలు
న్యూస్‌టుడే, గద్వాల

రాష్ట్ర ప్రభుత్వం మరోనాలుగు రోజుల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. నాలుగు విడతలుగా రైతులకు రుణమాఫీ రూ.లక్ష వరకు చేస్తామని చెప్పినా.. అమల్లో మాత్రం ఆశించిన ప్రగతి కనిపించలేదు. రూ.25 వేలలోపు రుణం ఉన్నవారికి మాత్రం మాఫీ వర్తింపజేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం కలిపినా ఆ రైతుల సంఖ్య 50 వేలలోపే ఉంది. మాఫీ అయిన సొమ్ము రూ.47 కోట్ల వరకు ఉంటుంది. అయితే బ్యాంకర్లు మాత్రం ప్రతి రైతు నుంచి పంట రుణం వడ్డీని కట్టించుకుని రుణాలను రెన్యువల్‌ చేశారు. ప్రభుత్వం రుణమాఫీ సమయంలో వడ్డీతోసహా వెనక్కు ఇస్తుందని, దాన్ని తమ ఖాతాల్లో వేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు చెల్లించిన వడ్డీ వెనక్కు వచ్చిన పరిస్థితి లేదని రైతులు పేర్కొంటున్నారు.

ఇక ప్రభుత్వం మరోసారి ఏకకాలంలో రుణమాఫీ అన్న అంశంపై పునరాలోచిస్తుందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో రైతు సమీక్ష సమావేశాల్లో చెబుతున్నారు. కానీ ఏకకాలంలో రుణమాఫీ ఎంత వరకు సాధ్యమవుతుందో అన్నది ప్రస్తుతం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏకకాలంలో కాకుండా పాత పద్ధతిలో నాలుగు విడతల్లో ప్రకటిస్తే రైతుల నుంచి విముఖత వ్యక్తమయ్యే పరిస్థితి ఉంటుందనే వాదన వినిపిస్తోంది. గతంలో వైఎస్సాఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకకాలంలో రుణమాఫీ వర్తింపజేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకకాలంలో రుణమాఫీ అన్నది రైతులకు అందని ద్రాక్షగానే మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని