logo

సేవలు గుర్తించి.. పురస్కారాలు అందించి!

 రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో అధికారికంగా నిర్వహించింది.

Published : 09 Mar 2023 05:33 IST

హనుమకొండ కలెక్టరేట్‌, వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే :  రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో అధికారికంగా నిర్వహించింది. వర్సిటీ ఆడిటోరియంలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేషంగా సేవలు అందించిన 27 మంది మహిళలకు రూ.లక్ష నగదుతో పాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, వరంగల్‌ నగర మేయర్‌ సుధారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ భారతి హోళికేరి, హనుమకొండ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, వరంగల్‌ నగర మున్సిపల్‌ కమిషనర్‌ ప్రావీణ్య అందించడంతో పాటు ఘనంగా సత్కరించారు. వారి సేవలను కొనియాడారు. పురస్కారాలు అందుకున్న వారు ఒక్కో రంగంలో తమదైన ముద్ర వేశారు. వనితా లోకానికి స్ఫూర్తిగా నిలిచారు.



పేరు : కర్నె శంకరమ్మ

స్వస్థలం : మహబూబ్‌నగర్‌

రంగం : కిన్నెర జానపదం

ప్రత్యేకత : 18 ఏళ్ల వయసులో తన తండ్రి నుంచి కిన్నెర వాయిద్యం నేర్చుకున్నారు. ఈ కళ ద్వారా 15 కథలు ప్రచారం చేస్తున్నారు.  కళను బతికిస్తున్నారు.


పేరు : డా. గూడూరు మనోజ

స్వస్థలం : మహబూబ్‌నగర్‌

రంగం : ఆద్యకళ

ప్రత్యేకత : పాలమూరు వర్సిటీలో ఇంగ్లిషు ఆచార్యురాలిగా చేసి పదవీవిరమణపొందారు. అంతరించిపోతున్న ఆదిమ జాతీయత  సంస్కృతిపై అధ్యయనం చేశారు. 18 సంవత్సరాలుగా దాన్ని కాపాడేందుకు పాటుపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని