logo

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్‌కుమార్‌సుల్తానియా అధికారులను ఆదేశించారు.

Published : 16 Apr 2024 03:22 IST

అధికారులను ఆదేశించిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌సుల్తానియా

కొల్లాపూర్‌ : ఎల్లూరు రేగుమాన్‌గడ్డ తీరంలో అధికారులతో మాట్లాడుతున్న పీఆర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌,  వనపర్తి జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవర్‌, అదనపు కలెక్టర్‌ సంచిత్‌గంగ్వార్‌, భగీరథ  అధికారులు

కొల్లాపూర్‌, న్యూస్‌టుడే : వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్‌కుమార్‌సుల్తానియా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న శ్రీశైలం తిరుగుజలాల నిల్వలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. సోమవారం సందీప్‌కుమార్‌ సుల్తానియా నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, వనపర్తి జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవర్‌, అదనపు కలెక్టర్‌ సంచిత్‌గంగ్వార్‌, భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, అధికారులతో కలిసి నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు తీరంలోని కృష్ణానది ప్రవాహప్రాంతం కోతిగుండు, నీటినిల్వ రేగుమాన్‌గడ్డ తీరంలో నీటి లభ్యతను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో నీటినిల్వ వివరాల గురించి భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి వివరించారు. వేసవిలో కావాల్సిన నీళ్లు, ప్రస్తుతం నిల్వ ఉన్న శ్రీశైలం తిరుగుజలాలు, లీకేజీలకు మరమ్మతులు చేయిస్తున్న చర్యల గురించి చెప్పారు. ఎల్లూరు భగీరథ ప్లాంట్‌ దగ్గర శుద్ధజలం, నీటి సరఫరా వివరాలను సందీప్‌కుమార్‌ సుల్తానియాకు వివరించారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని భగీరథ అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారించేందుకు తీసుకున్న చర్యలను కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ ప్రత్యేక కార్యదర్శికి వివరించారు. భగీరథ సీఈ చెన్నారెడ్డి, ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈలు శ్రీధర్‌రావు, సుధాకర్‌సింగ్‌, డీఈలు అంజాద్‌పాషా, మల్లేశ్వర్‌రావు, ఏఈలు వెంకటేశ్వర్‌రావు, జలవనరులశాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని