logo

వందరోజుల్లో కాంగ్రెస్‌పై భ్రమలు తొలగాయి

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న భ్రమలు వందరోజుల్లోనే తొలగిపోయాయని భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు.

Published : 24 Apr 2024 06:32 IST

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

అలంపూర్‌, ఉండవల్లి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న భ్రమలు వందరోజుల్లోనే తొలగిపోయాయని భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. అలంపూర్‌చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం నిర్వహించిన అలంపూర్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఇచ్చిన 35 వేల ఉద్యోగాలకు సంబంధించిన పత్రాలనే నేడు రేవంత్‌రెడ్డి ఇవ్వడం జరిగింది తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదన్నారు. పార్టీ నుంచి నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను సమర్థంగా నిర్వహించి లక్షల మంది విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దారన్నారు. ఆయనను గెలిపిస్తే అలంపూర్‌ వాణి లోక్‌సభలో విన్పిస్తారన్నారు. మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ చల్లాకు ఎమ్మెల్యే విజయుడు ఎడమ భుజం అయితే ఆర్‌ఎస్పీ కుడిభజంగా ఉంటాడన్నారు.

మాట్లాడుతున్న కేటీఆర్‌.. ప్రవీణ్‌కుమార్‌ను గెలిపించాలని కోరుతున్న ఎమ్మెల్సీ చల్లా, ఎమ్మెల్యే విజయుడు

అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికలలో తనను గెలిపిస్తే అలంపూర్‌ నియోజకవర్గంలోని ప్రజలందరూ పార్లమెంటుకు వెళ్లినట్టే అన్నారు. మన ప్రాంతానికి న్యాయం చేసేందుకు శతవిధాలుగా కృషి చేస్తామన్నారు. అలంపూర్‌ ప్రజలు ఆశీర్వదిస్తేనే ఎమ్మెల్యేగా విజయుడు అత్యధిక మెజార్టీ సాధించారని, లోక్‌సభ ఎన్నికలలో కూడా ప్రజలు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ను ఆశీర్వదించి అలంపూర్‌ నియోజకవర్గ ప్రజలు అధిక మెజార్టీని అందించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ ఇద్దరూ తనకు మిత్రులే కానీ సీఎంగా గెలిచిన రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. అలంపూర్‌చౌరస్తా నుంచి రాయచూరు మార్గాన్ని జాతీయ రహదారిగా చేయాలని కేటీఆర్‌కు విన్నవించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, నాయకులు కిశోర్‌, సుభాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని