logo

కస్తూర్బా విద్యాలయం సిబ్బందిపై వేటు

కేజీబీవీలో నలుగురు సిబ్బందిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఈవో ఇందిర ఉత్తర్వ్యులు జారీ చేశారు.

Published : 30 Apr 2024 05:33 IST

ధరూరు, న్యూస్‌టుడే: కేజీబీవీలో నలుగురు సిబ్బందిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఈవో ఇందిర ఉత్తర్వ్యులు జారీ చేశారు. జిల్లాలోని కేజీబీవీల్లో సరుకుల పక్కదారి పడుతున్నాయని ఫిర్యాదులు వచ్చినా విచారణ చేసే క్రమంలో ఉన్నతాధికారులే వారికి వత్తాసు పలకటం, విచారణ నివేదికలను గోప్యంగా ఉంచి వారికి అనుకూలంగా ఇవ్వటంపై ‘పెద్దసార్లు తలుచుకుంటే అంతా గప్‌చుప్‌’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం రావటంతో జిల్లా కలెక్టర్‌ సంతోష్‌ స్పందించారు. కేజీబీవీల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి సరుకుల పక్కదారిపై విచారించి నివేదిక ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. విచారణ చేసిన అదనపు కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక అధారంగా ధరూరు కేజీబీవీ ప్రత్యేక అధికారి, అకౌంటెంట్‌, సీఆర్టీ ఉపాధ్యాయురాలు, అటెండర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఈనెల 25న డీఈవో ఉత్తర్వ్యులు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని