logo

సత్తా చాటిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రెయిబో పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని యాజమాన్యం తెలిపింది.

Updated : 01 May 2024 07:09 IST

రెయిన్‌బో విద్యార్థులతో ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయ అధ్యాపక బృందం

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే : పదో తరగతి ఫలితాల్లో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు సత్తాచాటాయి. ఆయా పాఠశాలల విద్యార్థులు 10 జీపీఏతో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను అభినందించాయి.

రెయిన్‌బో ప్రభంజనం : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని రెయిబో పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని యాజమాన్యం తెలిపింది. మన్హబింత్‌ మహమ్మద్‌, సయ్యద్‌ మిస్బాఉద్దీన్‌, అనిమిత్‌ప్రీతం, మెతుకు శైలజ, అందె రోహిత్‌, ముసలి సాయికాంత్‌రెడ్డి, కె.శ్రీనాథ్‌రెడ్డి, ఆర్‌.పల్లవిక, ఫాతిమాఖదీర్‌, ఎం.నక్షత్ర, జి.సాయిశ్రీరెడ్డి, వి.నందిని, బి.వైష్ణవి మొత్తం 13 మంది 10 జీపీఏ సాధించారు. 9.8 జీపీఏ 9 మంది, 9.7 జీపీఏ ఐదుగురు, 9.5 జీపీఏ ఐదుగురు, 9.3 జీపీఏ ఆరుగురు, 9.2 జీపీఏ 8 మంది, 9.0 జీపీఏ ఆరుగురు, 8 జీపీఏ ఆపై 90 శాతం మంది విద్యార్థులు సాధించారు. పాఠశాల కరస్పాండెంట్‌ డా.మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ మమత, వైస్‌ ప్రిన్సిపల్‌ నరేష్‌, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

 పంచవటి జైత్రయాత్ర : పదో తరగతి ఫలితాల్లో మహబూబ్‌నగర్‌లోని పంచవటి విద్యాలయం విద్యార్థులు అప్రతిహత జైత్రయాత్రను కొనసాగించారని యాజమాన్యం తెలిపింది. 10 జీపీఏ 52 మంది విద్యార్థులు, 9.8 జీపీఏ 34 మంది, 9.7 జీపీఏ 23,  9.5 జీపీఏ 11,   9.3 జీపీఏ 12,  9.2 జీపీఏ 8,  9.0 జీపీఏ ఏడుగురు సాధించటంతో పాఠశాల జిల్లాలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. మ్యాథ్స్‌లో 127 మంది, సైన్స్‌లో 124, సోషల్‌లో 114, తెలుగులో 112, ఇంగ్లిష్‌లో 107, హిందీలో 105 మంది 10 జీపీఏ సాధించారని చెప్పారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్‌ టి.అనితా శ్రీకాంత్‌రెడ్డి, ఛైర్మన్‌ టి.శ్రీకాంత్‌రెడ్డి అభినందించారు.

 శ్రీఅక్షర అద్భుతం : పదో తరగతి ఫలితాల్లో శ్రీఅక్షర పాఠశాల అద్భుతమైన ఫలితాలు సాధించిందని యాజమాన్యం తెలిపింది. 10 జీపీఏ, 9.8 జీపీఏ, 9.7 జీపీఏ సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, కరస్పాండెంట్‌, ప్రిన్సిపల్‌ చంద్రప్రకాశ్‌, ఉపాధ్యాయ బృందం అభినందించింది. పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందని ప్రిన్సిపల్‌ తెలిపారు.
శ్రీ ‘ప్రతిభ’ చాటింది.. : పది ఫలితాల్లో శ్రీ ప్రతిభ విద్యార్థులు ప్రతిభ చాటి అత్యుత్తమంగా రాణించారని ఆ పాఠశాల యాజమాన్యం తెలిపింది. డి.షణ్ముఖప్రియ, బి.ఆరోహిరెడ్డి 10 జీపీఏ సాధించారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను యాజమాన్య ప్రతినిధుiలు ఆనంద్‌రెడ్డి, వెంకటరమణ, కమలాకర్‌, ప్రిన్సిపల్‌ హారిక, ఉపాధ్యాయులు సన్మానించారు.

శ్రీచైతన్య విజయకేతనం: ఖమ్మం విద్యావిభాగం : పదో తరగతి పరీక్షల్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచినట్లు ఖమ్మం శ్రీచైతన్య విద్యా సంస్థల ఛైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య తెలిపారు. తమ విద్యాసంస్థల్లో చదివే వారిలో అత్యధికంగా 557 మంది 10 గ్రేడ్‌ పాయింట్లు, 1,147 మంది 9.8 జీపీఏకి పైగా సాధించినట్లు తెలిపారు. 1,702 మంది విద్యార్థులు 9.7 జీపీఏకి పైగా సాధించినట్లు పేర్కొన్నారు. గణితంలో 3,845 మంది విద్యార్థులు, సైన్స్‌లో 4,099 మంది, సోషల్‌లో 4,351 మంది, లాంగ్వేజెస్‌లో 11,669 మంది 10 జీపీఏ సాధించారన్నారు. సబ్జెక్టుల వారీగా 10 జీపీఏ సాధించినవారు 14,253 మంది ఉన్నారని తెలిపారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ జోన్‌లో 147 మంది 10 జీపీఏ సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను అభినందించారు.
అపెక్స్‌ సంచలనం : అపెక్స్‌ విద్యార్థులు వి.తేజస్విని, సుమయ్య ముస్కాన్‌, వి.యశస్విని, ఎ.సహర్ష, ఎం.నరహరి, లిజా మహిన్‌, జి.సాయిచరణ్‌, ఆర్‌.గణేశ్‌నాయక్‌, రహమతుల్లాఖాన్‌, ఎం.నవీన్‌కుమార్‌, ఎం.మోక్షిత, జి.మీనాక్షి, ఎ.అఖిల్‌చారి 10 జీపీఏ సాధించారని యాజమాన్యం తెలిపింది. 9.8 జీపీఏ 8 మంది, 9.7 జీపీఏ 10 మంది, 9.5 జీపీఏ 5 మంది సాధించడంతో పాటు వందశాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. కరస్పాండెంట్‌ కె.శివజ్యోతి, ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
న్యూరిషి విజయకేతనం : మహబూబ్‌నగర్‌ రాజేంద్రనగర్‌లోని న్యూరిషి పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబర్చి విజయకేతనం ఎగరవేశారని యాజమాన్యం తెలిపింది. 10 జీపీఏ 11 మంది, 9.8 జీపీఏ 11 మంది, 9.7 జీపీఏ 9 మంది, 9.5 జీపీఏ 19 మంది, 9 జీపీఏ 82 మంది విద్యార్థులు సాధించారు. పాఠశాలలో 98.9 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్‌ పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రిన్సిపల్‌, యాజమాన్యం సన్మానించారు.
మెరిసిన గెలాక్సీ : పదో తరగతి ఫలితాల్లో గెలాక్సీ మరోసారి అత్యుత్తమ ఫలితాలతో గ్రేడ్‌లకు మారుపేరుగా నిలిచిందని యాజమాన్యం తెలిపింది. 2023-24 ఫలితాల్లో 10 గ్రేడ్‌లు సాధించటంతో పాటు వందశాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. వివేక్‌దత్తా, ఎన్‌.సర్వజ్ఞ 10 జీపీఏ సాధించి పాఠశాల కీర్తిని ఇనుమడింపజేశారని, మొత్తం 38 మందికి గాను 18 మంది 9.0కి పైగా జీపీఏ సాధించారని తెలిపారు. పది జీపీఏ, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్‌ భానుప్రకాశ్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని