logo

శుద్ధి చేశాకే.. మిషన్‌ భగీరథ నీటి సరఫరా

ప్రైవేటు ప్లాంట్ల కంటే మిషన్‌ భగీరథ నీరు స్వచ్ఛమైనవని ఈఈ మేఘారెడ్డి అన్నారు. మంగళవారం ‘ఈనాడు’లో ‘నాలుగు రోజులుగా తాగునీటికి పాట్లు’ అనే శీర్షికన ప్రచురితమైన చిత్ర కథనానికి అధికారులు స్పందించారు

Published : 01 May 2024 06:59 IST

సిబ్బందికి సూచనలిస్తున్న మిషన్‌ భగీరథ ఈఈ మేఘారెడ్డి
శ్రీరంగాపురం, న్యూస్‌టుడే : ప్రైవేటు ప్లాంట్ల కంటే మిషన్‌ భగీరథ నీరు స్వచ్ఛమైనవని ఈఈ మేఘారెడ్డి అన్నారు. మంగళవారం ‘ఈనాడు’లో ‘నాలుగు రోజులుగా తాగునీటికి పాట్లు’ అనే శీర్షికన ప్రచురితమైన చిత్ర కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ మిషన్‌ భగీరథ నీటిని వందశాతం శుద్ధి చేసిన అనంతరం గ్రామాలకు సరఫరా చేస్తామని తెలిపారు. విండో సీఈవో శివకుమార్‌ను వివరణ కోరగా.. బోరు ద్వారా నీరు అందకపోవడంతోనే ప్రజలకు సరిపడా నీటిని అందించ లేకపోతున్నామని తెలిపారు. త్వరలో బోరుకు మరమ్మతులు చేయించి నీరందిస్తామన్నారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ అధికారులు అమిత్‌, లక్ష్మణ్‌కుమార్‌, ఉదయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని