logo

తుమ్మిళ్లలో తాగునీటి కష్టాలు

మిషన్ భగీరథ నీరు అరకొరగా రావడం, నీరు అపరిశుభ్రంగా వస్తుండటంతో మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో ప్రజలు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు.

Updated : 06 May 2024 17:10 IST

రాజోలి: మిషన్ భగీరథ నీరు అరకొరగా రావడం, నీరు అపరిశుభ్రంగా వస్తుండటంతో మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో ప్రజలు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రతినిత్యం వారు దూరంగా ఉన్న నదికి వెళ్లి చెలిమెల నీరు తెచ్చుకుంటున్నారు. గ్రామంలో 4 వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. వారందరికి మూడు ట్యాంకుల నీరు అందాల్సి ఉండగా, పూర్తి స్థాయిలో అందడం లేదు. కొన్ని రోజుల క్రితమే ఈ సమస్యను గుర్తించిన అధికారులు తుంగభద్ర నదిలో నీటి ట్యాంకు తవ్వించి నీరు సరఫరా చేస్తున్నారు. రానున్న రోజుల్లో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని