logo

భారాస కనుమరుగు కావడం ఖాయం

పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భారాస కనుమరుగు కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  సోమవారం ఆయన మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, రేమద్దుల, బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

Published : 07 May 2024 02:57 IST

మంత్రి జూపల్లి

పాన్‌గల్‌, న్యూస్‌టుడే : పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భారాస కనుమరుగు కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  సోమవారం ఆయన మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, రేమద్దుల, బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బుసిరెడ్డిపల్లి గ్రామంలో రైస్‌మిల్లు ప్రారంభించారు. అనంతరం మండల స్థాయి ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించి ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ చివరిదశకు చేరుకుందని, ప్రతి కార్యకర్త శ్రమించి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థులను అత్యధిక మోజార్టీ అందించేలా పని చేయాలని సూచించారు. ఇతర పార్టీల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని హితవు పలికారు.

ఎన్నికల అనంతరం స్థానిక ఎన్నికలు

పార్లమెంటు ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో నాయకులు డా.కేతూరి వెంకటేశ్‌, రవి, వెంకటేశ్‌, మధుసూదన్‌రెడ్డి, గోవర్ధన్‌సాగర్‌, పుల్లారావు, వహీద్‌ పాల్గొన్నారు.


ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు

పాన్‌గల్‌, న్యూస్‌టుడే : గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అలసత్వం చేయకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం పాన్‌గల్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో మాట్లాడారు. తేమశాతం పేరుతో ఇబ్బంది పెడుతున్నారని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ధాన్యం కొనుగోలు చేసిన తక్షణమే రైతుకు రశీదు ఇవ్వాలని సూచించారు. అక్కడి నుంచి మంత్రి డీఆర్డీవోతో చరవాణిలో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కొనగోళ్లలో వేగవంతం చేయక పోతే చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి వెంట నాయకులు వెంకటేశ్‌, గోవర్ధన్‌, రవి, రాము, బ్రహ్మయ్య, మధుసూదన్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు