logo

ఎస్సీ వర్గీకరణ భాజపాతోనే సాధ్యం: మందకృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణ భాజపా తోనే సాధ్యమవుతుందని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మద్దతు తెలుపుదామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

Published : 07 May 2024 19:12 IST

రాజోలి: ఎస్సీ వర్గీకరణ భాజపా తోనే సాధ్యమవుతుందని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మద్దతు తెలుపుదామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అయిజ పట్టణంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధనకై మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ముఖ్య అతిధులుగా మందకృష్ణ మాదిగ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి భరథ్ ప్రసాద్ హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ, అభ్యున్నతి కోసం నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారనీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా భాజపా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు