logo

ప్రధాని పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

ప్రధాని మోదీ నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేశ్‌గౌతం తెలిపారు. 

Published : 10 May 2024 03:49 IST

 మాట్లాడుతున్న ఎస్పీ యోగేశ్‌గౌతం
నారాయణపేట, న్యూస్‌టుడే : ప్రధాని మోదీ నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేశ్‌గౌతం తెలిపారు.  పేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల ఎస్పీలతోపాటు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు 9మంది, సీఐలు 30, ఎస్సైలు 72, ఏఎస్సైలు, హెచ్‌సీలు 150, పీసీలు 550, హెచ్‌జీలు 200, మహిళా పోలీసులు 100మంది, 4రోప్‌ పార్టీలు, 4టీఎస్‌ఎస్‌పీ ప్లాటూమ్స్‌, ట్రైనీ పోలీసులు, ప్రత్యేక విభాగం పోలీసులు మొత్తం 1000మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరగుతుందని పేర్కొన్నారు. పేటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఉమ్మడి జిల్లా నుంచి బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ యోగేశ్‌గౌతం భద్రతాపరమైన సూచనలు చేశారు.  మొత్తం 11సెక్టర్‌లుగా విభజించి సిబ్బందిని నియమించడం జరిగిందని వివరించారు. అధికారులు ఎవరికి కేటాయించిన ప్రదేశాల్లో వారు ఉంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు విధింపు

 ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో పేటలోని ఎర్రగుట్ట ప్రాంతంలో హెలిప్యాడ్‌ నుంచి మినీస్టేడియం సభ ప్రాంగణం వరకు వెళ్లే మార్గం ఎక్లాస్‌పూర్‌-వై జంక్షన్‌, జీషన్‌ రెస్టారెంట్, పద్మజా భారత్‌ గ్యాస్‌, ఎంబీ చర్చి, పళ్ల వాగు వంతెన, సత్యనారాయణ చౌరస్తా, మినీస్టేడియం వరకు 2.30 నుంచి 3.30 గంటల వరకు ట్రాఫిక్‌ నియంత్రించడం జరుగుతుందన్నారు. 3.30 నుంచి 4.30గంటల్లో మినీస్టేడియం గ్రౌండ్‌ సభ ప్రాంగణం నుంచి నర్సిరెడ్డి చౌరస్తా, అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు, పళ్లవాగు వంతెన, అయ్యప్ప స్వామి దేవాలయం, హెలిప్యాడ్‌ వరకు ట్రాఫిక్‌ నియంత్రణ ఉంటుందని చెప్పారు. సభకు వచ్చే కార్యకర్తల వాహనాల పార్కింగ్‌ కోసం కోస్గి, మద్దూర్‌, దామరగిద్ద నుంచి వచ్చే వాహనాలు బారంబావి వద్ద పార్కింగ్‌కు అవకాశం కల్పించామన్నారు. మహబూబ్‌నగర్‌, మరికల్‌, ధన్వడ నుంచి వచ్చే వాహనాలకు మార్కెట్ యార్డులో, ఎస్‌ఎల్‌డీసీ డీగ్రీ కాలేజ్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. పగిడిమర్రి, వల్లంపల్లి దారుల నుంచి వచ్చే వాహనాలను జీపీ శెట్టి ఫంక్షన్‌హాల్‌లో పార్కింగ్‌కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ట్రైనీ ఐపీఎస్‌ చిత్తరంజన్‌ దాస్‌, అదనపు ఎస్పీలు నాగేంద్రుడు, గుణశేఖర్‌, భరత్‌, డీఎస్పీలు మహేశ్‌, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని