logo

ఓటు వేసి సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం

ఎంత మంది వ్యతిరేకించినా సోనియా గాంధీ సాహస నిర్ణయంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యపడిందని కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి రుణం తీర్చుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Published : 10 May 2024 04:01 IST

  మంత్రి జూపల్లి కృష్ణారావు

వెల్దండలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

వెల్దండ, న్యూస్‌టుడే : ఎంత మంది వ్యతిరేకించినా సోనియా గాంధీ సాహస నిర్ణయంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యపడిందని కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి రుణం తీర్చుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం వెల్దండ మండల కేంద్రంలో నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ అభ్యర్థి మల్లురవికి మద్దతుగా మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థి మల్లురవి, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ బాలాజీసింగ్‌తో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతోనే రైతు భరోసా, పింఛను, ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ సాధ్యపడుతుందన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను పక్కాగా అమలు చేస్తుందన్నారు. నియోజకవర్గంలోని భూనిర్వాసితులకు నిధులు మంజూరు చేయాలని భారాస మంత్రులను, అప్పటి సీఎం కేసీఆర్‌ను ఎన్ని పర్యాయాలు కలసి విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు. అందువల్లనే పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరానన్నారు. భూనిర్వాసితులకు అందాల్సిన రూ.19.41 కోట్ల పరిహారం వారి ఖాతాల్లో జమఅయిందని సంతోషం వ్యక్తం చేశారు. మన ప్రాంత వాసి రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అన్నిరంగాల్లో అభివృద్ధికి చేయూత అందనుందన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీ అభ్యర్థి మల్లురవి కోరారు. సమావేశంలో మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌, మండలాధ్యక్షుడు మోతీలాల్‌నాయక్‌, మాజీ సర్పంచి భూపతిరెడ్డి, పర్వత్‌రెడ్డి, వెంకటయ్య గౌడ్‌, ఇందిరాశోభన్‌, జంగయ్యయాదవ్‌, శ్రీను, కృష్ణముదిరాజ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు