logo

గెలిపిస్తే రైల్వే లైన్‌ ఏర్పాటుకు కృషి చేస్తా

ఎంపీగా తనను గెలిపిస్తే నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు నియోజకవర్గానికి రైల్వే లైను తీసుకొస్తానని భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ అన్నారు.

Updated : 10 May 2024 06:27 IST

మాట్లాడుతున్న భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌, డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌, రామకృష్ణారెడ్డి, జెట్టి వెంకటేశ్‌
నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : ఎంపీగా తనను గెలిపిస్తే నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు నియోజకవర్గానికి రైల్వే లైను తీసుకొస్తానని భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ అన్నారు. గురువారం వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద ఉన్న భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడోసారి మోదీ ప్రధానమంత్రి అవగానే నాగర్‌కర్నూల్‌ అభివృద్ధికి నిధులు రాబడతామన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. కొల్లాపూర్‌లో మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌, గద్వాలలో కేంద్రీయ విద్యాలయం, వనపర్తిలో ఇండస్ట్రియల్‌ జోన్‌, నల్లమల్లలో ఆలయం, పర్యాటక జోన్‌గా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్‌, భారాస నేతలు భాజపాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా మాట్లాడిన వీడియోలను మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేశారన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలపై ప్రజలు నిలదీస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు ప్రధానమంత్రి అభ్యర్థి లేరన్నారు. భారాసకు ఓటు వేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. భాజపాకు 400 సీట్లు ఇస్తే దేశం మరింత శక్తివంతమవుతుందన్నారు. సమాశంలో డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌, రామకృష్ణారెడ్డి, జెట్టి వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని