logo

ధరల భారం మోపుతున్న భాజపాకు బుద్ధి చెప్పాలి

నిత్యవసర ధరల భారం మోపుతూ.. మతోన్మాద విధానాలు అనుససరిస్తున్న భాజపాకు ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు.

Updated : 10 May 2024 17:36 IST

రాజోలి: నిత్యవసర ధరల భారం మోపుతూ.. మతోన్మాద విధానాలు అనుససరిస్తున్న భాజపాకు ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. ఆయన శుక్రవారం మండల కేంద్రమైన రాజోలిలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్మికులు సాధించకున్న హక్కులను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని, ఎలక్ట్రాన్ బాండ్ల పేరుతో పెట్టుబడిదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆరోపించారు. మతం, కులం పేరుతో ప్రజల మధ్య విభజన సృష్టిస్తోందన్నారు. భాజపాతో భారాస లోపాయికారి ఒప్పందం చేసుకొందని, ఈ రెండు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి విజయ్‌కుమార్, సీఐటీయూ నాయకులు లక్ష్మన్న, జయన్న, తిక్కన్న, పౌలు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు