logo
Published : 29/11/2021 01:31 IST

‘గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఏవీ..?’

సమావేశంలో మాట్లాడుతున్న పీపీ రాథోడ్‌

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన అనంతరం సీఎం కేసీఆర్‌ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఏడేళ్లయినా ఆ మాటే మరిచారని బంజారా ఉద్యోగుల సేవా సంఘం (బేస్‌) రాష్ట్ర అధ్యక్షుడు పీపీ రాథోడ్‌ ఆరోపించారు. ఆదివారం నర్సాపూర్‌లోని మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన బేస్‌ జిల్లా కార్గవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్న సీఎం, మాట తప్పారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దిల్లీలో ధర్నా చేసిన ఏకైక కుల సంఘం బంజారా సంఘమేనని గుర్తు చేశారు. ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడితే, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక దాని ఫలాలు ఒక్కటీ తమకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల తండాల్లో విద్య, వైద్యానికి నోచుకోకుండా, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న గిరిజనుల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా సంఘం ముందుకు సాగుతోందని తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసిరాంరాథోడ్‌, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు పెంట్యానాయక్‌, మంజూనాయక్‌, ప్రధాన కార్యదర్శి అర్జున్‌నాయక్‌, ఎంఈవో బుచ్చానాయక్‌, నర్సాపూర్‌ అధ్యక్షుడు రాంచందర్‌, బాధ్యులు చెన్నా, చందర్‌, లాలూ, ఎల్‌.శ్రీనివాస్‌, పంతూనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని