logo
Published : 02/12/2021 03:54 IST

మాట్లాడు కన్నడ.. నేర్చుకో తెలుగు..

కర్ణాటక సరిహద్దు మండలాల విద్యార్థులకు అనుకూలమైన విద్య

ఔదత్‌పూర్‌లోని కన్నడ పాఠశాల

న్యూస్‌టుడే, మనూరు: రాష్ట్ర సరిహద్దు.. జిల్లా శివారు.. పైగా మూడు రాష్ట్రాల సంగమంగా నారాయణఖేడ్‌ నియోజకవర్గం. మనూరు, న్యాల్‌కల్‌, కంగ్టి మండలాల పరిదిలోనిÅ పలు గ్రామాల్లో కన్నడం, మరాఠీ తప్ప తెలుగు రాసేవారు. మాట్లాడేవారు చాలా స్వల్పం. ముఖ్యంగా ఉమ్మడి మనూరు, న్యాల్‌కల్‌ మండలాల్లో కన్నడం మాట్లాడేవారు అధికం. అప్పట్లో పాలకులు, అధికారులు కన్నడ పాఠశాలలను ఏర్పాటు చేసి బోధించారు. మన రాష్ట్ర విద్యార్థులు వేలమంది నష్టపోయారు. అనంతరం స్పందించిన ప్రభుత్వం మొదటి భాషగా తెలుగు, రెండో భాషగా ఆంగ్లం, మూడో భాషగా కన్నడ బోధించాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా చదువుకొని ఉద్యోగాలు సంపాదించవచ్చు. మూడేళ్ల నుంచి ఇలా అమల్లో ఉంది. ఉమ్మడి మనూరు మండలం, న్యాల్‌కల్‌ మండలంలోని ఔదత్‌పూర్‌, గౌడ్‌గామ్‌జనవాడ, కారాముంగి, షాపూర్‌, ఏస్గి, శిఖర్‌కాన, గొందేగామ్‌, రత్నాపూర్‌ తదితర పన్నెండు పాఠశాలలో కన్నడ మాధ్యమ ప్రాథమిక పాఠశాలలు 30 ఏళ్ల కిందటే ఏర్పాటు చేశారు. 9వ తరగతి అనంతరం కర్ణాటక వెళ్లేవారు. తెలంగాణకు వచ్చినా భాష అర్థమయ్యేది కాదు. సరిహద్దు గ్రామాల 480 మంది విద్యార్థులు నష్టపోకుండా మూడు భాషల్లో బోధిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులోని కన్నడ పాఠశాలలో తెలుగు, కన్నడ, ఆంగ్లం మూడు భాషల్లో విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా చదువుకొంటున్నారు. గతంలో కొందరు విద్యార్థులు స్థానికేతరుల సమస్యలతో ఉద్యోగాలు పొందలేక కర్ణాటకలోనే స్థిర పడ్డారు. ప్రస్తుతం అవసరమైన ఉపాధ్యాయులను నియమించి విద్య కొనసాగిస్తున్నారు.

 

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని