logo

విద్యార్థులకు ప్రేరణ

ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రేరణ పేరుతో వారికి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Published : 28 Mar 2024 01:55 IST

అంతర్జాలంలో దరఖాస్తుకు అవకాశం

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జోగిపేట: ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రేరణ పేరుతో వారికి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకు 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనిపై విస్తృత ప్రచారం కల్పించి ఎక్కువ మందితో దరఖాస్తు చేయించాలని డీఈవోలకు ఆదేశాలిచ్చారు. వీరిలోంచి కొందరిని ఎంపిక చేస్తారు. అర్హులైన విద్యార్థులు  ్త్మ్మ్ప(:///్ప౯’౯్చ-్చ.’్ట్య‘్చ్మi్న-.్ణ్న‌్ర.i- లో తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ సమయంలోనే విద్యార్థులు తమ ప్రతిభ(టాలెంట్‌) వివరాలను నమోదు చేయాలి. పాఠశాల మెయిల్‌ ఐడీ వివరాలు జతపరచాలి. విద్యార్థులు ఎంపికైతే పాఠశాల మెయిల్‌ ఐడీకి వివరాలు పంపిస్తారు.

గుజరాత్‌లో ప్రత్యేక శిక్షణ: విద్యార్థులు ఎంపికైతే గుజరాత్‌ రాష్ట్రం వాద్రఘర్‌లోని పాఠశాలలో ఎక్స్‌పీరియన్షల్‌ లర్నింగ్‌ కార్యక్రమం పేరుతో ఐదు రోజుల పాటు గురుకుల పద్ధతిలో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అతి తక్కువ మంది విద్యార్థులను ఎంపిక చేసి ఐదు రోజుల పాటు వారికి భారత విద్యా విధానం, నూతన జాతీయ విద్యా విధానం, విలువైన విద్య, వివిధ రకాల ప్రయోగాలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన విద్యార్థుల గురించి వివరిస్తారు. అక్కడే విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుంటారు. విద్యార్థుల ప్రతిభను తెలుసుకొని అక్కడ ప్రదర్శించే అవకాశం కల్పిస్తారు.


సద్వినియోగం చేసుకోవాలి

అనూరాధ, ఏఎంవో, సమగ్ర శిక్షా

ప్రేరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాధ్యమైనంత ఎక్కువ మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేయించాలని సూచించాం. ఎంపికైన వారు ఐదు రోజుల పాటు అక్కడే ఉండి వివిధ అంశాల గురించి నేర్చుకుంటారు. విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని