logo

కేసీఆర్‌ మా ఫోన్లు ట్యాపింగ్‌ చేయించారు

మల్లన్న సాగర్‌ నిర్వాసితులమైన తమ ఫోన్లను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ట్యాపింగ్‌ చేయించారని నిర్వాసితులు ఎండీ హయాతుద్దీన్‌, వై.శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ..

Published : 02 May 2024 06:20 IST

మల్లన్న సాగర్‌ నిర్వాసితుల ఆరోపణ

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: మల్లన్న సాగర్‌ నిర్వాసితులమైన తమ ఫోన్లను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ట్యాపింగ్‌ చేయించారని నిర్వాసితులు ఎండీ హయాతుద్దీన్‌, వై.శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. మల్లన్న సాగర్‌ నిర్మాణంపై తాము న్యాయస్థానానికి వెళ్లి స్టే తెచ్చిన క్రమంలో గత ప్రభుత్వం, అప్పటి పోలీసులు తమపై నిఘా పెట్టారన్నారు. తాము కోర్టుకు వెళ్లినప్పటి నుంచి ఏ సమయంలో ఎక్కడ ఉన్నా.. ఎక్కడికి వెళ్లినా పోలీసులు అక్కడికి వచ్చేవారన్నారు. ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ తమను ఆయన నివాసానికి పిలిచి, ‘మీరు ఎవరిని కలుస్తున్నారో, ఏమి చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో మొత్తం సీఎంకు తెలుసు. మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని బెదిరించారన్నారు. తాము విమాన టికెట్‌ తీసుకున్న వివరాలూ కాసేపట్లో వారి వద్ద ఉండేవని ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే తమ ఫోన్లను సైతం కేసీఆర్‌ ట్యాపింగ్‌ చేయించారని భావిస్తున్నామన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ చేసి బాధ్యులైన మాజీ సీఎం కేసీఆర్‌, ఇతర నాయకులు, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మల్లన్నసాగర్‌ నిర్వాసితులు జి.తిరుపతి, ఎం.కృష్ణారెడ్డి, జి.చందు, కె.చందు, టి.కరుణాకర్‌రెడ్డి, ఎ.అశోక్‌, యాదగిరి తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని