logo

ఇంటి నుంచే ఓటు.. చైతన్యం చాటు

ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఎనలేనిది. దాన్ని పొందడమే కాకుండా.. వినియోగించుకోవడం అత్యంత ప్రధానం. వంద శాతం ఓటింగ్‌ ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. వయోభారం, అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న వారిలో కొందరు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు.

Published : 02 May 2024 06:41 IST

దివ్యాంగులు, వయోవృద్ధులకు అవకాశం
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇదే తొలిసారి
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, మెదక్‌, సిద్దిపేట

ఓటు ఎలా వేయాలో వివరిస్తున్న అధికారి

ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఎనలేనిది. దాన్ని పొందడమే కాకుండా.. వినియోగించుకోవడం అత్యంత ప్రధానం. వంద శాతం ఓటింగ్‌ ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. వయోభారం, అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న వారిలో కొందరు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా తొలిసారిగా పార్లమెంట్‌ ఎన్నికల్లో వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించడం విశేషం.

న్నికల విధులు నిర్వర్తించే వారికి ఉద్యోగులకు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం ఉంటుంది. ఇప్పుడా జాబితాలో వయోవృద్దులు, దివ్యాంగులు సైతం చేరారు. వీరు సైతం ఇంటి నుంచే ఓటు అవకాశాన్ని ఎన్నికల సంఘం గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కల్పించింది. 40 శాతానికి మించి వైకల్యం ఉన్న దివ్యాంగులు, 80 ఏళ్ల వయసు పైబడిన వయోవృద్ధులు ఈ సౌకర్యం వినియోగించుకునేందుకు అర్హులు. ఈ సారి 85 ఏళ్లు నిండిన వారికే అవకాశం కల్పించారు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈ నెల 2, 3 తేదీల్లో ఈ ప్రక్రియ కొనసాగించనున్నారు. మెదక్‌ జిల్లాలో 3వ తేదీ నుంచి షురూ కానుంది.

నమూనా పోలింగ్‌లో అంధులు


దరఖాస్తుదారులకే..

పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో ఇంటి నుంచే ఓటు సదుపాయం కోసం ముందస్తు దరఖాస్తు తప్పనిసరి. ఈ విధానాన్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ అమలుచేశారు. ఇది విజయవంతం కావడంతో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ అమలుకు నిర్ణయించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఆసక్తి ఉన్న వారి నుంచి ఫారం 12-డి దరఖాస్తులను ఇప్పటికే స్వీకరించారు. సదరం ధ్రువపత్రంలో వైకల్య నిర్ధారణ 40 శాతానికి మించి, వృద్ధాప్య విభాగంలో 85 ఏళ్లు, ఆపైబడిన వారిని అర్హులుగా గుర్తించారు. ఈవిషయమై మెదక్‌ ఆర్వో రాహుల్‌రాజ్‌, జహీరాబాద్‌ నియోజకవర్గ ఆర్వో వల్లూరు క్రాంతి ఎప్పటికప్పుడు సమీక్షించారు.


చిత్రం నిక్షిప్తం

ప్రక్రియను చేపట్టేందుకు ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేశారు. గెజిటెడ్‌ అధికారి, సహాయకుడు, పోలీసు, వీడియోగ్రాఫర్‌, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. వీరు లబ్ధిదారుల ఇంటికెళ్లి ఓటేయిస్తారు. ఈ ప్రక్రియనంతా చిత్రీకరిస్తారు.


పోలింగ్‌ కేంద్రాల వద్ద వసతులు

ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్ధేశంతో ర్యాంపులు ఏర్పాటుచేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా నియమించిన నోడల్‌ అధికారులు కేంద్రాల్లో సదుపాయాలపై ఆరా తీస్తున్నారు. కనీస సదుపాయాలు లేని కేంద్రాల సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నారు. బ్బందులు తలెత్తకుండా మూడు చక్రాల సైకిళ్లు కూడా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


దుబ్బాక స్ఫూర్తిగా..

దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేయడానికి నానాపాట్లు పడుతుంటారు. వారి వెతలు తీర్చేలా కొత్తగా ఇంటి నుంచి ఓటేసే విధానాన్ని 2020 నవంబరులో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ నియోజకవర్గవ్యాప్తంగా అర్హులను గుర్తించి వారితో దరఖాస్తు చేయించారు. ఓటేసే తీరుపై అవగాహన కల్పించారు. పోలింగ్‌ రోజున ఎన్నికల అధికారులే పోస్టల్‌ బ్యాలెట్‌ను అర్హుల ఇంటికి తీసుకెళ్లి వారితో రహస్యంగా ఓటేయించారు. అప్పట్లో 80 ఏళ్లు దాటిన వారికి అవకాశం కల్పించడం గమనార్హం. ఇలా 80 ఏళ్లు దాటిన వృద్ధులు 1,089 మంది ఓటేయగా.. 469 మంది దివ్యాంగులు దీన్ని వినియోగించుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన నాగార్జునసాగర్‌, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ప్రవేశపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని