logo
Published : 27/11/2021 05:15 IST

రహదారి రాళ్లమయం

దామెర శివారులో పోసిన మట్టిలో ప్రమాదకరంగా రాళ్లు

చౌటుప్పల్‌గ్రామీణం,న్యూస్‌టుడే: చౌటుప్పల్‌ మండలం తంగడపల్లి నుంచి దామెర శివారు వరకు రహదారి నిర్మాణంలో భాగంగా మట్టి పోశారు. నెల రోజులు గడిచినా ఇంకా పనులు ప్రారంభించడం లేదు. ఈ మట్టిలో ఉన్న పెద్ద పెద్ద రాళ్లు రహదారిపైకి రావడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రయాణికులు కింద పడినప్పుడు రాళ్లు తగిలితే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. ఈ రహదారి నుంచే సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడతో పాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి గుత్తేదారునితో పనులను ప్రారంభించేలా, ప్రమాదకరంగా ఉన్న రాళ్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని