logo
Published : 03/12/2021 03:13 IST

పైసలు వీరికి.. పనులు ఇంకొకరికి

నల్గొండ జిల్లా పరిషత్‌, హుజూర్‌నగర్‌- న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో కొంతమంది విద్యుత్తు సిబ్బంది ప్రైవేటుగా సహాయకులను నియమించుకుని పనులు చేయించుకుంటున్నారు. పనులు చేసే క్రమంలో నిబంధనలు విస్మరిస్తుండటంతో విద్యుదాఘాతాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులు హామీలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అయినా ఉన్నతాధికారులు ప్రమాద ఘటనలకు బాధ్యులైన  క్షేత్రస్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

* తుంగతుర్తి మండలం పరిధిలోని దేవునిగుట్ట తండా సమీపంలో సోమవారం విద్యుదాఘాతంతో సురేష్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇటీవల చింతలపాలెం మండలంలో వరుసగా రెండు విద్యుత్తు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పీక్లానాయక్‌తండాలో జరిగిన ప్రమాదంలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ సీతయ్య నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ వ్యక్తిని అసిస్టెంట్‌గా ఏర్పాటు చేసుకొని విద్యుత్తు పనులు చేయించారు. నియంత్రికపై ఎక్కువ సంఖ్యలో ఉన్న కనెక్షన్ల్లు తొలగించే క్రమంలో ప్రైవేట్‌ వ్యక్తి రంగాచారి విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయాలయ్యాయి. అదే ఉద్యోగి సీతయ్య కింద హెల్పర్‌గా వెళ్లిన మరో వ్యక్తి విద్యుదాఘాతంతో చనిపోయారు. ఇలా ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.

నిబంధనలు తుంగలో..
నిర్దేశిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాల్సిన కరెంటు ఉద్యోగులు పట్టణాలకు మకాం మార్చుకుంటున్నారు. కొందరూ ఉద్యోగులు విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో స్థిర నివాసముండాలని నిబంధనలు ఉన్నప్పటికీ చాలామంది పాటించడం లేదు. ఈ క్రమంలో వ్యవసాయ బోరు బావులు, గృహాలకు సరఫరా అయ్యే నియంత్రికలపై హార్న్‌ గ్యాప్‌ ఫీజు కాలిపోతున్నాయి. సాంకేతిక లోపాలు సరిచేయడం లేదు. వెరసి రైతులు చనిపోతున్నారు. మరి కొంత మంది విద్యుత్తు ఉద్యోగులు విధులకు దూరంగా ఉంటూ హెల్పర్లపైనే భారం వేస్తున్నారు. బిల్లుల వసూలు సమయంలోనే రెగ్యులర్‌ ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. మిగతా రోజుల్లో గ్రామాల్లో ప్రైవేట్‌ వ్యక్తులను హెల్పర్లుగా ఏర్పాటు చేసుకొని వారి ద్వారానే కొత్తగా విద్యుత్తు మీటర్ల బిగింపు, కనెక్షన్లు, విద్యుత్తు నియంత్రికల వద్ద ఫీజులు వేయించడం, లైన్ల మార్పిడి వంటి పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్తు సిబ్బంది తప్పిదాలతో చాలా మంది హెల్పర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిపై  ఆధారపడిన కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడుతున్నారు. ఆదుకోవాల్సిన విద్యుత్తు శాఖ తమ బాధ్యత కాదని తప్పుకుంటోంది.


గోడు వినే వారేరి?

మోతెకు చెందిన జిల్లపల్లి శివకృష్ణ అక్కడి లైన్‌మెన్‌ కింద ప్రైవేటు వర్కర్‌గా చేరారు. 2018 ఏప్రిల్‌లో 6న ఇతన్ని కరెంటు స్తంభం ఎక్కించారు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో లైన్‌మెన్‌ నిర్లక్ష్యంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఎడమ చెయ్యి, కుడి కాలు పూర్తిగా తీసివేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉద్యోగం ఇస్తామని, అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. కానీ నేటికి ఎలాంటి ఆసరా కల్పించలేదు. ఇటీవల జిల్లా ఉన్నతాధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు.


ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం  
-శర్మ, డీఈటీ నల్గొండ సర్కిల్‌

విద్యుత్తు సంస్థలో క్షేత్రస్థాయీ సిబ్బంది ప్రవేట్‌ హెల్పర్లతో పనులు చేయిస్తున్నాట్లు ఎవరైన ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎక్కడైన ప్రమాదం చోటు చేసుకుంటే సంబంధిత సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నాం. ఉద్యోగులు విధులు నిర్వహించే ప్రాంతంలో వినియోగదారులు అందుబాటులో ఉండి విద్యుత్తు సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉంది.  ప్రత్యేకంగా పర్యవేక్షించాలని డీఈలకు అదేశాలు జారీ చేస్తాం.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని