logo

న్యాయం చేయరూ..?

కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న త్రిబుల్‌ఆర్‌ (ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణం)తో భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో గుబులు మెదలైంది. గుత్తేదారు సంస్థ (కేఅండ్‌జే) రహదారి వెళ్లే మార్గాన్ని ప్రాథమికంగా గుర్తిస్తూ హద్దులు ఏర్పాటు

Published : 19 Jan 2022 04:17 IST

ఇబ్రహింపూర్‌ వద్ద తమ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్న నిర్వాసితులు

తుర్కపల్లి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న త్రిబుల్‌ఆర్‌ (ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణం)తో భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో గుబులు మెదలైంది. గుత్తేదారు సంస్థ (కేఅండ్‌జే) రహదారి వెళ్లే మార్గాన్ని ప్రాథమికంగా గుర్తిస్తూ హద్దులు ఏర్పాటు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ భూముల్లో హద్దులు పాతొద్దంటూ ఎవరికి వారు నిర్వాసితులు గుత్తేదారు సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాతముత్తాల కాలం నాటి నుంచి సాగు చేసుకుంటున్న తమ వ్యవసాయ భూములను తీసుకోవడం భావ్యం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుత్తేదారు సంస్థ డ్రోన్ల సాయంతో ఏర్పాటు చేసుకుంటూ పోయిన హద్దుల దిమ్మెలను కొన్ని చోట్ల నిర్వాసితులు తవ్వి తొలగించారు. భూమిని నమ్ముకుని బతుకుతున్న వారికి అన్యాయం చేయొద్దని రైతులు వేడుకుంటున్నారు. తమ భూములను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు బహిరంగ మార్కెట్‌ ధరలు చెల్లించి నష్టపరిహారం అందించాలని మరికొందరు నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రాంతీయ వలయ రహదారి జిల్లాలో తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌ వరకు ఏర్పాటు చేయనున్నారు.
బహిరంగ మార్కెట్‌ ధర చెల్లించాలి
-జేరిపోతుల నరేందర్‌
మాది నిరుపేద కుటుంబం. ముగ్గురు అన్నదమ్ముళ్లం. ఉన్నదే మూడు ఎకరాల భూమి అందులో రెండు ఎకరాలు రోడ్డులో పోతే మేమెలా బతకాలి. భూములకు బహిరంగ మార్కెట్‌ ధరలు ఎంత ఉన్నాయో అది చెల్లించి ఇంటికో ఉద్యోగం ఇచ్చి నిర్వాసితులందరినీ ఆదుకోవాలి. మేము రహదారి నిర్మాణం వ్యతిరేకించటం లేదు, అలాని స్వాగతించటమూ లేదు. నిర్వాసితులకు న్యాయం చేయమంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని