logo

అసైన్డ్‌ భూములు లాక్కోవడం సమంజసం కాదు: కుంభం

కేసీఆర్‌ పాలనపై రైతులు, ప్రజలు విసిగిపోతున్నారని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భూదాన్‌పోచంపల్లి పురపాలిక పరిధిలోని రేవణపల్లిలో రైతులు, ప్రజలతో కలిసి శనివారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 22 May 2022 03:59 IST

రేవణపల్లిలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: కేసీఆర్‌ పాలనపై రైతులు, ప్రజలు విసిగిపోతున్నారని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భూదాన్‌పోచంపల్లి పురపాలిక పరిధిలోని రేవణపల్లిలో రైతులు, ప్రజలతో కలిసి శనివారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.వరంగల్‌ సభలో రాహుల్‌గాంధీ ప్రకటించిన డిక్లరేషన్‌ కరపత్రాలను రైతులకు అందించారు. అనంతరం రైతుల సమస్యలు తెలుసుకొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించారు. పేదలకు పంచిన అసైన్డ్‌ భూములను ప్రభుత్వం లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తర్వాత రాజీవ్‌గాంధీ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తడ్క వెంకటేశం, పాక మల్లేశం, మర్రి నర్సింహారెడ్డి, సామ మోహన్‌రెడ్డి, భారత వాసుదేవ్‌, లవకుమార్‌, జగన్‌రెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని