సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి: ఎస్పీ
పోలీసులు ప్రజలతో మమేకమవ్వాలని, వారి నుంచి సమాచారాన్ని సేకరించేలా అనుసంధానం కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఆత్మకూర్(ఎస్) పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది కిట్లను తనిఖీ చేస్తున్న జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్
నడిగూడెం, న్యూస్‌టుడే: పోలీసులు ప్రజలతో మమేకమవ్వాలని, వారి నుంచి సమాచారాన్ని సేకరించేలా అనుసంధానం కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. గురువారం నడిగూడెం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది కవాతును పరిశీలించారు. స్టేషన్ దస్త్రాలను, నేరాలు, కేసుల తీవ్రతను సమీక్షించారు. సిబ్బంది ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అన్ని గ్రామాల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో పోలీసులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, స్థానిక ఎస్సై ఎం.ఏడుకొండలు పాల్గొన్నారు.
సిబ్బంది సంక్షేమానికి కృషి: ఎస్పీ... ఆత్మకూర్(ఎస్): పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడు కృషి చేస్తామని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. తనిఖీల్లో భాగంగా గురువారం ఆయన ఆత్మకూర్(ఎస్) పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. కేసుల నమోదు స్థితిగతులను గ్రామ రిజిస్టర్లు, స్టేషన్ భౌగోళిక పరిస్థితులను తెలుసుకున్నారు. సిబ్బంది కవాతును, వారి ఏకరూప దుస్తులు, కిట్ల సామగ్రిని తనిఖీ చేశారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలున్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించాలన్నారు. నిత్యం ప్రజలతో మంచి సంబంధాలను కలిగి ఉండాలన్నారు. ఎస్పీ వెంట సీఐ సోమనారాయణసింగ్, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, స్థానిక ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Kurnool: జగన్ ప్రసంగిస్తుండగా యువకుడిపై పోలీసుల దాడి
-
Sports News
IND vs PAK: కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Ap-top-news News
Amaravati: పనులే పూర్తి కాలేదు.. గృహ ప్రవేశాలు చేయమంటే ఎలా?
-
Politics News
Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం