logo

నైపుణ్య శిక్షణ.. ఉపాధి రక్షణ

పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) పూర్తి చేసిన వారికి అప్రెంటీస్‌షిప్‌ కోసం పరిశ్రమలో చేరుతారు. దీంతో ఉపాధితో పాటు నేర్చుకున్న కోర్సుల్లో నైపుణ్యం పెంపొందించుకుంటారు.

Published : 26 Mar 2023 04:45 IST

ఆర్టీసీలో యువతకు అప్రెంటీస్‌షిప్‌

 

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) పూర్తి చేసిన వారికి అప్రెంటీస్‌షిప్‌ కోసం పరిశ్రమలో చేరుతారు. దీంతో ఉపాధితో పాటు నేర్చుకున్న కోర్సుల్లో నైపుణ్యం పెంపొందించుకుంటారు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐటీఐలో డీజిల్‌ మెకానిక్‌గా పూర్తి చేసిన యువకులకు జిల్లాలోని ఏడు ఆర్టీసీ డిపోలో అప్రెంటీస్‌షిప్‌ పేరుతో 26 మందికి ఏడాది పాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల నుంచి వీరికి శిక్షణ ప్రారంభమైంది. ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.

ఇరు పక్షాలకు ఉపయోగం

ఆర్టీసీకి శ్రామిక్‌ సిబ్బంది కొరత ఉంది. చాలా రోజులుగా నియామకాలు లేవు. డిపోలో బస్సులు మరమ్మతు చేయడానికి ఇబ్బంది అవుతుంది. అప్రెంటిషిఫ్‌లో వీరిని తీసుకొని పని చేయించడం వల్ల నైపుణ్యం పెరుగుతుంది. దీంతో పాటు ఆర్టీసీ సిబ్బంది కొరత అధిగమించవచ్చు. దీనిని పూర్తి చేసిన వారికి ఎన్‌సీటీవీ జారీ చేసే ధ్రువపత్రాలు ఇస్తారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. శిక్షణ సమయంలో రూ.6,930 ఉపకార వేతనం ఇస్తారు. ఏటా ఒక బ్యాచ్‌ ఈ శిక్షణ తీసుకుంటోంది. వారికి డిపార్టుమెంటు రూట్‌ పాస్‌ ఇస్తారు.


యువత సద్వినియోగం చేసుకోవాలి: నాగరాజు

ఐటీఐ పూర్తి చేసిన యువతకు ఆర్టీసీ లాంటి సంస్థలో అందించే అప్రెంటీస్‌షిప్‌ శిక్షణను వినియోగించుకోవాలి.దీంతో నైపుణ్యం పెరగడంతో పాటు స్టయిఫండ్‌ ఇస్తారు. శిక్షణను వినియోగించుకుంటే భవిష్యత్తులో మంచి సంస్థలో ఉద్యోగ అవకాలు లభిస్తాయి.


పని నేర్చుకుంటున్నాం: రాహుల్‌

శిక్షణ బాగుంది. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యంతో బయటికి వెళ్లాక ఇతర సంస్థలో పని చేస్తామనే భరోసా కలుగుతుంది. ఉపాధి దొరుకుతుందనే నమ్మకం ఉంది. ఉపకార వేతనం రూ.10 వేలకు పెంచాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని