logo

బండెక్కిన అతిథులు.. ఆనందంలో అన్నదాతలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. రైతు వేదికల్లో జరిగిన కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో హాజరయ్యారు.

Published : 04 Jun 2023 04:12 IST

తిప్పర్తిలో ర్యాలీగా వస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, తదితరులు

ఈనాడు, నల్గొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. రైతు వేదికల్లో జరిగిన కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో హాజరయ్యారు.

* శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్ల, తాళ్లవెల్లంలలో రైతు దినోత్సవానికి హాజరయ్యారు. జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత పాల్గొన్నారు.

* మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట మండలం ఎండ్లపల్లిలో రైతు వేదిక వద్ద జరిగిన రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. ఎడ్లబండిపై మంత్రి తరలిరాగా..రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరు వెంకటరావు పాల్గొన్నారు.

* భూదాన్‌ పోచంపల్లిలో జరిగిన రైతు దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, యాదాద్రి జిల్లా కలెక్టరు పమేలా సత్పతితో కలిసి హాజరయ్యారు.

* మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమానికి భారీ ట్రాక్టర్ల ర్యాలీతో ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలిసి రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

* నకిరేకల్‌ మండలం చందుపట్లలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి నల్గొండ కలెక్టరు వినయ్‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

*  తిప్పర్తి, కనగల్‌లో జరిగిన రైతు దినోత్సవంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. భారీగా రైతులు ట్రాక్టర్ల ర్యాలీతో తరలివచ్చారు. తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*  దేవరకొండలో జరిగిన కార్యక్రమానికి నల్గొండ జిల్లా భారాస అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ రైతు వేషధారణలో ఎడ్లబండిపై వచ్చారు.  

*  హుజూర్‌నగర్‌ మండలం లింగగిరిలో జరిగిన రైతు దినోత్సవానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ట్రాక్టర్‌లో రైతులతో కలిసి హుజూర్‌నగర్‌ నుంచి తరలివెళ్లారు.

*  మోటకొండూరు మండలం చాడలో జరిగిన ఉత్సవాలకు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ సునీత ఎడ్ల బండిపై హాజరయ్యారు.

*  హాలియా మండలం కొత్తపల్లి రైతు వేదికలో జరిగిన కార్యక్రమానికి సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌, జిల్లా అదనపు కలెక్టరు కుష్బు గుప్తా, అప్కాబ్‌ మాజీ ఛైర్మన్‌ ఎడవల్లి విజేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

*  త్రిపురారం మండలంలో నిర్వహించిన రైతు సదస్సులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ట్రైకార్‌ ఛైర్మన్‌ రామచంద్రునాయక్‌ పాల్గొన్నారు.

*  తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తొండలో జరిగిన రైతు సదస్సులో ఎమ్మెల్యే గాదారి కిశోర్‌, జడ్పీ ఛైర్మన్‌ గుజ్జ దీపిక, అదనపు కలెక్టరు దీపక్‌ తీవారి పాల్గొన్నారు.

*  మునగాల మండలం నేలమర్రిలో జరిగిన రైతు సదస్సుకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ హాజరయ్యారు.

*  మునుగోడు మండలం పులిపలుపుల, చండూరు మండలం పుల్లెంలలో జరిగిన రైతు సదస్సులకు స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

*  భువనగిరి మండలం బొల్లెపల్లిలో రైతు వేదికలో నిర్వహిస్తున్న ఉత్సవాలను యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అడ్డుకున్నారు. రెండు నెలలు దాటిన ధాన్యం కొనుగోలు చేయకుండా సంబరాలు ఎందుకని వేడుకలకు హాజరైన జిల్లా భారాస అధ్యక్షుడు, ఆయిల్‌ఫెడ్‌ ఛైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని