logo

Nagarjuna Sagar: 69 ఏళ్లుగా.. తెలుగింటి బంధంగా నాగార్జున సాగర్‌!

‘ఇక్కడ నేను చేస్తున్న శంకుస్థాపనను పవిత్ర కార్యంగా భావిస్తున్నా.. ఇది భారత ప్రజా సౌభాగ్య మందిరానికే శంకుస్థాపన.. ఈనాడు మనం ఆసేతుహిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవదేవాలయానికి ఇది చిహ్నం..’ 

Updated : 10 Dec 2023 07:56 IST

‘ఇక్కడ నేను చేస్తున్న శంకుస్థాపనను పవిత్ర కార్యంగా భావిస్తున్నా.. ఇది భారత ప్రజా సౌభాగ్య మందిరానికే శంకుస్థాపన.. ఈనాడు మనం ఆసేతుహిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవదేవాలయానికి ఇది చిహ్నం..’ 

 సాగర్‌ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అన్నమాటలు.

 నిర్మాణంలో ముఖ్యాంశాలు

  • నాగార్జునసాగర్‌ డ్యాం నిర్మాణానికి ఖర్చు: రూ.73 కోట్లు
  • రోజుకు 45 వేల మంది కార్మికులు 12 ఏళ్లు, 24 గంటలు పనిచేశారు
  • జలాశయం విస్తీర్ణంలో ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉంది.
  • రాతి కట్టడంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది.
  • నీటి విడుదలలో సాగర్‌ కుడికాల్వ ప్రపంచంలో మొదటిది

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: భారతదేశపు భాండాగారంగా,  తెలుగురాష్ట్రాల అన్నపూర్ణగా పేరొంది కోట్లాది మంది ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది నాగార్జునసాగర్‌ డ్యాం. ప్రపంచంలో మానవులు నిర్మించిన ఈ రాతి కట్టాడాన్ని అపురూపమైన ప్రాజెక్టుగా ప్రపంచ దేశాలు సైతం శ్లాఘించాయి. 45వేల మంది మంది కార్మికులు నిత్యం కష్టపడుతూ 12 ఏళ్ల పాటు శ్రమించి దీనిని నిర్మించారు.  వారి ప్రాణ త్యాగ ఫలితంగా 22 లక్షల ఎకరాల సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు, పరిశ్రమలకు విద్యుత్‌ కాంతులను అందజేస్తుంది. తెలుగు రాష్ట్రాలను కరవు రక్కసి కబంధహస్తాల నుంచి 68 ఏళ్లుగా కాపాడుతూ.. ఇప్పుడు 69లోకి అడుగుపెడుతోంది నాగార్జునసాగర్‌.

సాగర్‌ డ్యాం ఎస్‌ఈగా పనిచేయడం గర్వంగా ఉంది: నాగేశ్వరరావు, ఎస్‌ఈ, ఎన్నెస్పీ

ప్రపంచ ఖ్యాతి సాధించి, కోట్లాది మందికి తాగునీటితో పాటు, లక్షలాది మందికి అన్నం పెడుతున్న సాగర్‌ డ్యాం ఎస్‌ఈగా పనిచేయడం ఎంతో గర్వంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు