logo

చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠా అరెస్టు

జిల్లాలో వరుసగా గొలుసు దొంగతనాలకు, చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠాను భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 20 Apr 2024 17:41 IST

భువనగిరి: జిల్లాలో వరుసగా గొలుసు దొంగతనాలకు, చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠాను భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఈ ముఠా వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రధాన నిందితుడు మరియాదాస్‌తో పాటు లక్ష్మీ, శివ, రాజేశ్‌లను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి 41 తులాల బంగారం, రెండు కిలోల వెండి, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగలను పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన పోలీస్ సిబ్బందిని సీసీ తరుణ్ జోషి అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని