logo

కొల్లూరులో వీరగత్తె విగ్రహం గుర్తింపు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని పాటిగడ్డ శివాలయం, వైష్ణవ ఆలయాల మధ్య అరుదైన, అపురూపమైన వీరగత్తె విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్‌ గుర్తించారు.

Updated : 30 Apr 2024 05:54 IST

ఆలేరు, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని పాటిగడ్డ శివాలయం, వైష్ణవ ఆలయాల మధ్య అరుదైన, అపురూపమైన వీరగత్తె విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్‌ గుర్తించారు. ఇందుకు సంబంధించి బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌, సభ్యుడు కుండె గణేష్‌ సోమవారం ఆలేరులో తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరాభిముఖాలైన రెండు చేతుల్లో బాకులతో యుద్ధం చేస్తున్న వీరవనితకు తల వెనుక భాగాన కొప్పు ముడిచి ఉందన్నారు. చెవులకు కుండలాలు, మెడకు కంటె, చేతులకు కంకణాలు, కాళ్లకు పాంజీబులు, మొలకు వీరకాసె కట్టి.. వీరగత్తె బండ పలక అయిదు అడుగుల ఎత్తు ఉందని తెలిపారు. ఒక చేత కత్తి, మరో చేత డాలు ధరించి యుద్ధం చేసే వీరులు, వీరవనితల విగ్రహాలు చాలా ఉన్నాయని, రెండు చేతుల్లో కైజారులతో యుద్ధ రంగాన డాకాలు ముందు నిలిచిన స్త్రీని వీరగా చూడడం చాలా అరుదని, ఇలాంటివి కొల్లూరులో ఉండడం విశేషమన్నారు. ఈ విగ్రహం కాకతీయుల కాలానికి చెందినదిగా తెలుస్తుందని, శత్రువులతో పోరాడి, వీరమరణం పొందిన వీరవనిత స్మారకంగా వేసిందే ఈ వీరశిల అని హరగోపాల్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని