logo

కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన

యాదాద్రి కలెక్టరేట్ కార్యాలయం ముందు వలిగొండ మండలం రైతులు ధాన్యం రోడ్డుపై పోసి నిరసన తెలుపుతూ ధర్నా చేశారు.

Published : 30 Apr 2024 15:27 IST

భువనగిరి: యాదాద్రి కలెక్టరేట్ కార్యాలయం ముందు వలిగొండ మండలం రైతులు ధాన్యం రోడ్డుపై పోసి నిరసన తెలుపుతూ ధర్నా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడిచిన ధాన్యం సరిగ్గా తీసుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదన్నారు. లారీలు రావడం లేదని, లారీలు వచ్చినా 40 కిలోల ధాన్యం బస్తాకు రూ.5 తీసుకుంటున్నారని ఆరోపించారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని మిల్లుల వద్దకు రాగానే బీ - గ్రేడ్ ధాన్యంగా మార్చి, క్వింటాలుకు 5 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపించారు. కల్లాల వద్ద పేరుకు పోయిన ధాన్యంను వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ తగు శ్రద్ధ చూపి తమకు నష్టం కలుగకుండా చూడాలని రైతులు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని