logo

కార్యకర్తలకు అండగా ఉంటాం: జగదీశ్‌రెడ్డి

కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా ఆదుకొని.. అండగా ఉంటామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 01 May 2024 06:12 IST

చండూరులో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

మర్రిగూడ, న్యూస్‌టుడే: కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా ఆదుకొని.. అండగా ఉంటామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశానికి మర్రిగూడ, నాంపల్లి మండలాల ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. నల్గొండ జిల్లాను 3 కుటుంబాలే ఏలుతున్నాయని విమర్శించారు. భారాస ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అభ్యర్థి క్యామ మల్లేశ్‌ మాట్లాడుతూ బీసీˆ బిడ్డను గెలిపించాలని అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్‌, రాజుగౌడ్‌, వెంకటేష్‌, యాదయ్య ఉన్నారు.

చండూరు: చండూరులో భారాస లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, భారాస ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ కేసీఆర్‌పై బురద చల్లేందుకు యత్నిస్తున్నారన్నారు. వంద రోజుల కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అయిందన్నారు. ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను ఆదరించిన కేసీఆర్‌కు భువనగిరి లోక్‌సభ స్థానాన్ని గెలిపించి కానుకగా ఇవ్వాలన్నారు. కొంతమంది నాయకులు తాను పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కేసీఆర్‌ నాకు తండ్రి సమానులు అని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కన్నీటి పర్వంతమయ్యారు. నాయకులు పాల్వాయి స్రవంతి, నారాయణరావు, పుర ఛైర్‌పర్సన్‌ తోకల చంద్రకళ, కౌన్సిలర్లు తోకల వెంకన్న, కోడి వెంకన్న, అన్నెపర్తి శేఖర్‌, కొత్తపాటి సతీష్‌లు పాల్గొన్నారు.

ప్రభుత్వాల వైఫల్యాలు ఇంటింటికి తీసుకెళ్లండి

నార్కట్‌పల్లి గ్రామీణం: భాజపా, కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యాలను ఇంటింటికి వివరించాలని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. నార్కట్‌పల్లిలోని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాసంలో భారాస ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశంతో కలిసి మంగళవారం రాత్రి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, జడ్పీఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల మాజీ ఛైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని