logo

పదిలో 9

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నల్గొండ జిల్లా 96.11శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది.

Published : 01 May 2024 06:26 IST

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నల్గొండ జిల్లా 96.11శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. గతేడాది 89.59 శాతంతో 17వ స్థానంలో ఉన్న నల్గొండ జిల్లా ఈ సారి 6.52 శాతం ఉత్తీర్ణత అదనంగా సాధించి 8 స్థానాలు అధిగమించింది. జిల్లా నుంచి మొత్తం 19,263 మంది పరీక్షకు హాజరుకాగా 18513 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల నుంచి 354 మంది, ప్రభుత్వ పాఠశాలల నుంచి 13 మంది 10 జీపీఏలు సాధించారు. ఈ పరీక్షలకు 473 పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరుకాగా 231 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. 101 ప్రభుత్వ పాఠశాలలు నూరుశాతం ఫలితాలు సాధించాయి.

  • పది పరీక్షల్లో ఎప్పటి మాదిరిగా బాలికలదే పైచేయిగా ఉంది. జిల్లా నుంచి పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల్లో బాలికలు 97.10 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 95.21శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 9124 మంది పరీక్షకు హాజరుకాగా 8,898 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 10,099 మంది పరీక్షకు హాజరుకాగా 9,615 మంది ఉత్తీర్ణత సాధించారు.

10 జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు...

జడ్పీ పాఠశాలలకు చెందిన నారగొని ప్రవళిక, నూక సాయిగణేష్‌(జి.ప.ఉ.పా పెరికకొండారం, శాలిగౌరారం మండలం), పొట్టబత్తిని ఫణిశ్రీ, కందగట్ల కీర్తన(నేరడ, చిట్యాల), సయ్యద్‌ సానియ(బకల్‌వాడ, మిర్యాలగూడ), ఎరపురి అక్షర(గర్ల్స్‌ హైస్కూల్‌, మిర్యాలగూడ), రమావత్‌ సర్దార్‌(తిరుమలగిరి), గొగుల మానస(ఆలగడప, మిర్యాలగూడ), రమావత్‌ తారకరూప(హాలియా, అనుముల మండలం), కుంచం శృతి(మారెపల్లి, అనుముల మండలం), ఆంగోతు నందు(తిరుమలగిరి), పిట్టల రమ్యశ్రీ(హాలియా, అనుముల మండలం), తాటికొండ శివ(మోడల్‌ స్కూల్‌, కనగల్‌)


ప్రత్యేక శ్రద్ధ వహించాం.. ఫలితాలు సాధించాం

బొలారం భిక్షపతి(డీఈవో, నల్గొండ)

విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే అకాడమిక్‌ పరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులు హాజరయ్యేలా చూడటంతో పాటు నవంబరు నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించాం. జనవరి నుంచి సాయంత్రం కూడా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి సందేహాలు నివృత్తి చేసేలా ఉపాధ్యాయులు కృషి చేశారు. ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని