logo

అత్యధికం 2.72 లక్షలు.. అత్యల్పం 5 వేలు

 నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో ఆధిక్యతల తీరు పరిశీలిస్తే ఔరా అన్పించేలా ఉన్నాయి. నియోజకవర్గంలో మొదటిసారి ఎన్నికలు జరిగిన సమయంలో జాతీయ స్థాయి రికార్డును నెలకొల్పడంతో పార్లమెంటు భవనాన్ని

Published : 03 May 2024 02:12 IST

హుజూర్‌నగర్‌, హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో ఆధిక్యతల తీరు పరిశీలిస్తే ఔరా అన్పించేలా ఉన్నాయి. నియోజకవర్గంలో మొదటిసారి ఎన్నికలు జరిగిన సమయంలో జాతీయ స్థాయి రికార్డును నెలకొల్పడంతో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అవకాశం కూడా ఈ నియోజకవర్గానికి దక్కడం విశేషం. లోక్‌సభకు ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నది 18వది. 1952లో ఉమ్మడి జిల్లాలో నల్గొండ ఒక్కటే లోక్‌సభ నియోజకవర్గం. ఇది కూడా ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి, సుంకం అచ్చాలు ఇద్దరూ పీడీఎఫ్‌ నుంచి ఎన్నికయ్యారు. రావి నారాయణరెడ్డి 2,72,280 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇది అప్పటి ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీ. జవహర్‌లాల్‌ నెహ్రూ కంటే అధిక మెజార్టీ రావడం వల్ల పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అవకాశాన్ని రావి నారాయణరెడ్డి అందుకున్నారు. ద్విసభ్య సభ్యుడిగా ఎన్నికైన సుంకం అచ్చాలు కూడా 1,85,280 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇక అత్యల్ప మెజార్టీ 1971లో నమోదైంది. టీపీఎస్‌ అభ్యర్థి అయిన కె.రామకృష్ణారెడ్డి, సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి వీఎన్‌ రెడ్డిపై 5,398 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో అత్యల్పంగా నమోదైన మెజార్టీ ఇదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని