logo

ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి: కలెక్టర్‌

ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్చాయుత వాతావరణంలో ప్రజలందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే అన్నారు.

Published : 08 May 2024 19:26 IST

భువనగిరి: ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్చాయుత వాతావరణంలో ప్రజలందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే అన్నారు. బుధవారం రాయగిరిలో పోలీసు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమీషన్ పోలింగ్ రోజున పోలింగ్ సమయం ఒక గంట అదనంగా పొడిగించడం జరిగిందని, ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు కోసం వీల్ ఛైర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, మెడికల్ కిట్లతో, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో, త్రాగునీరు వసతులు కల్పించడం జరిగిందని తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని