logo

ఎంపీ నిధుల కేటాయింపు ఇలా..!

దేశ అభ్యున్నతికి పార్లమెంటు ఒక దిక్సూచి. ప్రగతికి నాంది అక్కడి నుంచే మొదలవుతుంది.లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైతే ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ.. కేటాయించే నిధులను ప్రణాళికాబద్దంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Updated : 09 May 2024 07:01 IST

న్యూస్‌టుడే, నల్గొండ కలెక్టరేట్‌, గరిడేపల్లి: దేశ అభ్యున్నతికి పార్లమెంటు ఒక దిక్సూచి. ప్రగతికి నాంది అక్కడి నుంచే మొదలవుతుంది.లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైతే ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ.. కేటాయించే నిధులను ప్రణాళికాబద్దంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. లోక్‌సభ నియోజకవర్గాల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్‌ (లోకల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ స్కీమ్‌) కింద ఏటా రూ. 5 కోట్ల చొప్పున మంజూరవుతాయి. ఏడాదికి రెండు పర్యాయాలు రూ.2.5 కోట్ల చొప్పున విడుదల చేస్తారు. ఐదేళ్లలో ఏటా రూ 5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు ఎంపీ ల్యాడ్స్‌నిధులు వస్తాయి. మొదటి ఏడాదిలో ఖర్చు చేయకుంటే రెండో ఏడాది వినియోగించవచ్చు. నిధుల్లో కనీసం 15 శాతం ఎస్సీ, ఎస్టీ ఆవాస ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేటాయించాలి. ఈ పథకం 1993లో ప్రారంభమైంది. కేంద్ర ముఖ్య ప్రణాళికా మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటుంది. ఎంపీలు ప్రాధాన్యతాక్రమంలో తమ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తారు. ప్రధానంగా తాగునీరు, విద్యుత్తు, ఆరోగ్య, క్రీడలు, పారిశుద్ధ్యం, రోడ్లు, వంతెనలు, వ్యవసాయం, తదితర అభివృద్ధి పనులను ఆయన సిఫారసు చేయవచ్చు. కలెక్టర్‌ పాలనాపరమైన అనుమతులిస్తారు. పనులు పూర్తయ్యాక గుత్తేదారుకు నిధులు చెల్లిస్తారు. నిబంధనలకు లోబడి నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చేపట్టిన పని వివరాలను ఆ ప్రదేశం వద్ద ప్రదర్శించాలి. ఎంపీ పేరు, ఖర్చు చేసిన నిధులు, చేపట్టిన సంవత్సరం వివరాలను నమోదు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని