logo

వృక్ష, జంతు పరిరక్షణతోనే జీవ వైవిధ్యం

అంతరించిపోతున్న వృక్షాలు, జంతువులు, పక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు సీసీసీ, మెంబర్‌ సెక్రటరీ డాక్టర్‌ డి.నళిని మోహన్‌ స్పష్టం చేశారు. జీవ వైవిధ్య మండలి సౌజన్యంతో ఫడ్స్‌ స్వచ్ఛంద సహకారం, ఐ క్యాప్‌

Published : 22 May 2022 03:32 IST

నర్సరీలో వివరాలు తెలుసుకుంటున్న నళిని మోహన్‌

 

ఉదయగిరి, న్యూస్‌టుడే: అంతరించిపోతున్న వృక్షాలు, జంతువులు, పక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు సీసీసీ, మెంబర్‌ సెక్రటరీ డాక్టర్‌ డి.నళిని మోహన్‌ స్పష్టం చేశారు. జీవ వైవిధ్య మండలి సౌజన్యంతో ఫడ్స్‌ స్వచ్ఛంద సహకారం, ఐ క్యాప్‌ ఆధ్వర్యంలో ఉదయగిరిలో పెంచుతున్న ఔషధ మొక్కల నర్సరీని శనివారం సందర్శించారు. ఔషధ మొక్కల ఆవశ్యకత, జీవ వైవిధ్య పరిరక్షణ కమిటీల విధులను ప్రస్తావించారు. ఎర్రచందనం, జిట్రేగి, కుంకుడు, మర్రి, జువ్వి, రావి మొక్కలను నర్సరీల్లో పెంచి.. ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఉదయగిరి, దుత్తలూరు, మర్రిపాడు మండలాల్లోని ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలను ఉచితంగా పంపిణీ చేసి రోడ్లకు ఇరువైపులా పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఫడ్స్‌ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్‌ పీవీ రమణయ్య, దుత్తలూరు సమన్వయకర్త కేశవరావు, ఉదయగిరి బీఎంసీ కమిటీ సభ్యుడు బి.మాలకొండారెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని