logo

నేటి నుంచి విష్ణుశంఖారావం

శాసనసభకు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధనరెడ్డి పేర్కొన్నారు. దీనికోసం గురువారం నుంచి ‘విష్ణుశంఖారావం’ పేరిట ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

Published : 26 Jan 2023 01:58 IST

వచ్చే ఎన్నికలే చివరివి  - మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణు తదితరులు

కావలి, న్యూస్‌టుడే: శాసనసభకు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధనరెడ్డి పేర్కొన్నారు. దీనికోసం గురువారం నుంచి ‘విష్ణుశంఖారావం’ పేరిట ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. బుధవారం పట్టణంలోని ఆయన కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోభారం వెంటాడుతున్న దృష్ట్యా వచ్చే ఎన్నికలే తన రాజకీయ జీవితంలో చివరివని వెల్లడించారు. ఎన్నికల్లో నగదుపరంగా వెనుకబడుతున్న గత అనుభవాల దృష్ట్యా ఈదఫా ఈ అంశంలో కూడా సర్దుబాటు చేసుకోనున్నట్టు తెలిపారు. ప్రజాభిప్రాయం స్థిరంగా ఉండటం లేదన్నారు. ఓటర్లు మారుతున్నారన్నారు. మారేది కాలం కాదన్నారు. ఏదో ఒకరోజు మార్పు వస్తుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. గెలుపోటములను సమభావంతోనే చూసినట్టు గుర్తుచేశారు. 1994 ఎన్నికల్లో తాను చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యానన్నారు. తన ప్రత్యర్థి అయిన దివంగత సీపీఎం నేత జక్కా వెంకయ్యను విజేతగా భావిస్తూ అప్పటికప్పుడే అభినందించానన్నారు. గత ఎన్నికల్లో తెదేపా అధినేత ఆహ్వానంతో ఆ పార్టీ తరఫున పోటీ చేశానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీచిన వ్యతిరేక పవనాలతో తాను సైతం ఓటమి చెందానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం తనకు అంకితభావంతో సహకరించారని వివరించారు. ఓడిన తరువాత ఆ పార్టీ అధినేతతో మాట్లాడేందుకు కూడా అవకాశం కలగలేదన్నారు. ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నట్టు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నట్టు వివరించారు. విష్ణుశంఖారావంతో ప్రజల ఇళ్ల వద్దకే నేరుగా వెళ్లి స్వయంగా తెలుసుకుంటున్నట్లు వివరించారు. అన్ని గ్రామాలు, మజరాలకు సైతం వెళ్తానన్నారు. ప్రజల నుంచి తెలుసుకునే ఆయా సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. సహచరులు, అనుచరులతో చర్చించాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని